టీడీపీ మంత్రి నుండి గ్రౌండ్ లోని కార్యకర్త దాకా ఎవరు ఏం మాట్లాడాలో నిర్ణయించేది బాబు గారే అని ఆ పార్టీ వీడిన ఎంతోమంది నాయకులు ఎన్నోసార్లు చెప్పారు. ఇది నిజమని ఆ పార్టీ వర్గాలు కూడా ఎన్నో సార్లు ఒపుకున్నాయి.ఎన్నికల ముందు వరకు జగన్,మోదీ,కెసిఆర్ లను టార్గెట్ చేసిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు పవన్ మీద పడ్డారు.

2014 లో పవన్ మరియు మోదీ సహాయం తో టీడీపీ ఒకటిన్నర శాతంతో వైసీపీ  మీద గెలిచింది.2019 లో స్వయంగా బాబు గారే పవన్ ని తమతో కలుపుకోవాలి అని చూసినా పవన్ దానికి అంగీకరించలేదు.దానితో టీడీపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది.అందువల్ల ఎన్నికలలో ఓటమి చుడాల్సి వచ్చింది.దానిని తట్టుకోలేకపోతున్నా టీడీపీ ఇప్పుడు పవన్ టార్గెట్ చేస్తుంది.

2009 లో అన్న తమ ఓటమికి కారణం అయ్యాడు.2019 లో తమ్ముడు మా ఓటమికి కారణం అయ్యాడు అని పవన్ కు అసలు నిబద్ధత లేదని టీడీపీ క్యాడర్ వారు ఆరోపిస్తున్నారు.మరి ఇలా తమ పార్టీ వారికి బాబు గారే పవన్ టార్గెట్ చేయనున్నారా? లేక పార్టీ లోని నాయకులే ఇలా కావాలని పవన్ ని టార్గెట్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది


మరింత సమాచారం తెలుసుకోండి: