ఏపీ నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేబినెట్‌పై ఏర్పడనున్న తీవ్ర ఉత్కంఠకు రేపు తెరపడనుంది. రేపు జరుగబోయే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో కేబినెట్ కూర్పుపై చర్చించి, మంత్రుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. సామాజికవర్గాల వారీగా బేరీజులుగా వేసుకుని సమర్థత, విధేయత కలిగిన నాయకులనే మంత్రులుగా జగన్ ఎంపిక చేసినట్లు సమాచారం.
సామాజికవర్గాల వారీగా చూస్తే  రెడ్డి సామాజికవర్గం నుంచి ఏడుగురికి అవకాశం – బీసీ-6, కాపు-2, కమ్మ-2, ఎస్సీ మాల-2, ఎస్సీ మాదిగ-1, ఎస్టీ-1, క్షత్రియ-1, ముస్లిం మైనార్టీ-1 – బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కరికి కేబినెట్‌లో చాన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో మంత్రి పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది. సీనియర్లను, జూనియర్లను కలుపుతూ కేబినెట్‌ను రెడీ చేస్తున్నారు సీఎం జగన్. క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలకు మంత్రిపదవుల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించినట్లు తెలుస్తోంది. 


సామాజికవర్గాల వారీగా జగన్ కేబినెట్‌లో స్థానం దక్కేది వీరికే:

రెడ్డి సామాజికవర్గం (7)                  -    పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి, 
                                                             మేక‌పాటి గౌతం రెడ్డి, మేడా మల్లిఖార్జున రెడ్డి, బుగ్గ‌న రాజేంద్ర‌నాధ్ రెడ్డి, 
                                                             శిల్పా చ‌క్రపాణి రెడ్డి 


బీసీ సామాజికవర్గం (6)                 -      త‌మ్మినేని సీతారం, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్, పి పార్ధసార‌ధి,
                                                              మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ముత్యాల నాయుడు, కాపు రామ‌చంద్రారెడ్డి 


క‌మ్మ సామాజికవర్గం (2)               -        కొడాలి నాని, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్


ఎస్సీ మాల సామాజికవర్గం (2)     -     మేకతోటి సుచ‌రిత, తూర్పు గోదావ‌రి నుండి విశ్వ‌రూప్ 


ఎస్సీ మాదిగ సామాజిక వ‌ర్గం (1)    -   ప్రకాకాశం జిల్లాకు చెందిన ఆదిమూల‌పు సురేష్‌


ఎస్టీ సామాజికవ‌ర్గం (1)                   -    కురుపాం ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ వాణి 


క్ష‌త్రియ సామాజికవ‌ర్గం (1)           -    ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ప్ర‌సాద‌రాజు


ముస్లిం మైనార్టీ వర్గం  (1)            -     హిందూపురం నుంచి ఇక్బాల్‌ (ఎమ్మెల్సీగా అవకాశం)


బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం (1)       -    ర‌ఘుప‌తి లేదా మ‌ల్లాది విష్ణు


వైశ్యసామాజికవర్గం     (1)             -    కోల‌గ‌ట్ల వీర‌భ్ర‌ద స్వామి 


 కాపు సామాజివర్గం  (2 )              -     భీమ‌లి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస రావు, కుర‌సాల క‌న్న‌బాబు లేదా దాడిశెట్టి రాజాల్లో ఒక‌రికి ఛాన్స్ 


డిప్యూటీ స్పీకర్‌గా మహిళా ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే చిత్తూరు నుండి రోజాకు మంత్రిగా ఛాన్స్ ఉందా లేదా అని రేపు తెలుస్తోంది. అంబటి రాంబాబు పేరు కూడా లిస్ట్‌లో కనిపించడం లేదు కాబట్టి..అంబటికి స్పీకర్‌గా అవకాశం ఉంటుందో లేదో చూడాలి. మొత్తంగా రెండు, మూడు మార్పులు తప్పా, దాదాపుగా జగన్ డ్రీం కేబినెట్ ఇదే అని మీడియాలో చర్చ జరుగుతుంది. మరి కొత్త కేబినెట్‌లో ఎవరెవరికి అవకాశం వస్తుందనేది రేపు స్వయంగా సీఎం జగన్ ప్రకటిస్తే కాని తెలియదు.



మరింత సమాచారం తెలుసుకోండి: