పవన్ ఈరోజు అమరావతి వచ్చారు.  ఎన్నికల రిజల్ట్ వచ్చిన తరువాత మొదటిసారి ఆయన అమరావతిలోని తన కార్యాలయంలో నాయకులతో సమావేశం అయ్యారు.  భవిష్యత్తులో అనుసరించవలసిన మార్గాల గురించి చర్చించారు. ఎక్కడ ఎక్కడ ఎందుకు ఓటమి పాలయ్యారు అనేదానిపై  చర్చించుకున్నారు.  మంచిదే.  


దీనికంటే ముందు పవన్ చేయాల్సింది ఒకటి ఉంది.  రాజకీయంగా ఎంత శత్రువైనా కావొచ్చు.. మొదట ముఖ్యమంత్రిని కలిసి అభినందిస్తే బాగుండేది.  అది సంప్రదాయం కాబట్టి పవన్ కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా.  పార్టీ ఓడినా.. ఫ్యూచర్స్ లో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తో పనులు ఉండొచ్చు.  


అంతేకాదు.. రాష్ట్రం అభివృద్ధి కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాటం చేస్తానని ఇప్పటికే చెప్పారు.  జగన్ తో కల్సి ఆసరమైతే తాము కూడా ప్రభుత్వానికి మద్దతుగా ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ కు చెప్పితే మంచిదే కదా.  


జగన్ ను కలిసిన పవన్ అనే హెడ్డింగులు పేపర్లో మీడియాలో వస్తాయని, తెరవెనుక ఎదో జరుగుతుందని అందరు అనుకుంటారు.  అందువల్ల రేటింగ్ వస్తుందే దాని ఏమి ఉండదు కదా.  అనంతరం పవన్ ప్రజలతో కలిసి.. గ్రామస్థాయిలో బలపడేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటే బాగుంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: