కాంగ్రెస్ పార్టీలో వెన్నుపోటు రాజకీయాలు ఎక్కువయ్యాయి.  ఆ పార్టీ ఓటమికి అంతర్గత కలహాలు.. ఒకటిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వంటివి కూడా కారణం అయ్యాయి.  ఇది కేవలం రాష్ట్రంలోనే కాదు.. దేశం మొత్తమ్మీద కాంగ్రెస్ పరిస్థితి అలానే ఉన్నది.  అందుకే ఆ పార్టీ ప్రమాదకర స్థితిలో పడిపోయింది.  


అధికారంలో ఉన్న ఒక్కొక్క రాష్ట్రాన్ని వరసగా కోల్పోవడం మొదలుపెట్టింది.  ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన పద్దతిని మార్చుకోకుంటే ఇలాంటి ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది.  ఎన్నో గడ్డు పరిస్థితులను, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో మరింత దారుణంగా విఫలం అవుతూ వస్తున్నది.  


నాయకుల మధ్య సఖ్యతను నిలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కృషి చేయాలి.  ఎన్నికల సమస్యల్లో సమిష్టిగా కృషిచేసి ఎన్నికల్లోకి వెళ్ళాలి.  జంపింగ్ వ్యక్తులను పార్టీ వీలైనంత పక్కన పెడితే అంత మంచిది.  ఎందుకంటే రేపుమరునాడు పార్టీ విజయం సాధించినా.. ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలోకి జంప్ అవుతుంటారు.  


ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణనే తీసుకోవచ్చు.  కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వదిలి తెరాస లోకి జంప్ అవుతున్నారు.  రాజకీయాలంటే ఎలా ఉండాలో.. నాయకులను, పెద్దలను ఎలా వెన్నుపోటు పొడవచ్చో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లకు బాగా తెలుసు.  


మరింత సమాచారం తెలుసుకోండి: