టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. ఏపీ ప్రజలు బాబు ని ఘోరాతి ఘోరంగా ఓడించి షాక్ ఇస్తే, సొంత పార్టీ నేతలు మాత్రం బాబు కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు.అసలే మూలిగే నక్క ఆపై తాటికాయ పడింది అన్నట్టుగా, ఓటమి భాధలో కొట్టుమిట్టాడుతున్న బాబు పై ఇప్పుడు నేతల మూతి విరుపులు, అలక పాన్పులు మరింత తలనెప్పిని తెచ్చి పెడుతున్నాయి. గత రెండు రోజులుగా కేసినేని నాని అధినేత కి చుక్కలు చూపిస్తుంటే, తాజాగా మరో సీనియర్ నేత చంద్రబాబు కి బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారట. అంతేకాదు సదరు నేత చంద్రబాబు సొంత సామాజికవర్గం కావడంతో బాబు కి మరింత ఆందోళన కలుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

 Related image

2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచీ టీడీపీ లోకి వచ్చి, నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన ది మోస్ట్ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఇప్పుడు టీడీపీ కి దూరం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, రాయపాటికి పాయకరావుపేట లోక్ సభ స్థానం ఇవ్వనన్నారనే కొంపతో, ప్రెస్ మీట్ పెట్టి మరీ బాబుగారిని కడిగేశారు రాయపాటి, తానూ వైసీపీలోకి వెళ్ళే ఆలోచన చేయకపోయినా అభిమానులు అందరూ వైసీపీకి వెళ్ళమని అడుగుతున్నారని. చంద్రబాబు ఊహించినట్టుగానే పాయకరావుపేట లో తనకంటే సమర్ధుడు ఉంటే వారికే పట్టం కట్టండి అంటూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో జగన్ పాదయాత్ర తో మాంచి ఊపులో ఉన్నారు దాంతో ఇప్పుడు రాయపాటిని కదపకపోవడం మంచిదని భావించిన బాబు రాయపాటికి టిక్కెట్ ఇచ్చారు.

 Image result for rayapati with modi

కానీ 2019 ఫలితాలతో సీన్ రివర్స్ అయ్యింది. ఏపీ వ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలిలో రాయపాటి కూడా కొట్టుకుపోయారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ కడుతున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ అధినేత రాయపాటి అనే విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో రాయపాటి తన కాంట్రాక్ విషయంలో భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని బాబుని వీడి మోడీ చెంతకి వెళ్లేందుకు ప్రణాళిక రచించుకుంటున్నారని, టీడీపీలో ఇలానే కొనసాగితే తన వారసుడు రంగారావుకి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కష్టమని భావించిన రాయపాటి అతి త్వరలోనే బీజేపీ కండువా కప్పుకోనున్నారట. రాయపాటి గనుకా బీజేపీ గూటికి వెళ్ళడం ఖరారైతే మాత్రం బాబు కి ఇది కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయపండితులు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: