అలందా మీడియాతో వాటాల వివాదంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుగా నోటీస్ ఇచ్చిన అనంతరం అరెస్ట్ చేయాల నే యోచనతో ఉన్నట్లు సమాచారం. వాటాల విక్రయం, ఫోర్జరీ, తప్పుడు పత్రాలసృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు పంపారు. వీటికి స్పందించని రవిప్రకాశ్, నెల రోజులపైగా ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే హఠాత్తుగా విచారణకు హాజరైన ఆయన పోలీసులకు దర్యాప్తులో ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. దీనిని కారణంగా చూపి, పోలీసులు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Image result for raviprakash will be arrested

మూడు రోజులుగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు రవిప్రకాశ్ పొంతనలేని సమాధాలు ఇచ్చినట్లుగా తెలిసింది. టీవీ9 సృష్టికర్తను తానేనని, తానెలాంటి తప్పూ చేయలేదని చెబుతూ అసలు విషయాలను మాత్రం బహిర్గతం చేయాలేదని పోలీసుల వాదన. మరోవైపు టీవీ9 లోగో విక్రయానికి సంబంధించిన కేసులో రవిప్రకాశ్‌ శుక్రవారం విచారణ కు హాజరు కావాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.


సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలుత విచారణ నోటీస్‌ ఇచ్చిన అనంతరం అరెస్ట్‌ చేయాలనే ఆలోచనతో పొలీసులు ఉన్నట్లు తెలిసింది. 48గంటల ముందు సమాచారం ఇచ్చిన తర్వాతే అరెస్ట్‌ చేసే యోచనలో భాగంగా గురువారం న్యాయనిపుణులను కూడా సంప్రదించినట్లు సమాచారం. టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో సింహభాగం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ రవిప్రకాశ్‌పై ఫోర్జరీ, తప్పుడు పత్రాలసృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌, బంజారాహిల్స్‌ ఠాణాల్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Image result for raviprakash will be arrested

ముందస్తు బెయిల్‌ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు మూడు రోజుల క్రితం సైబరాబాద్‌ ఠాణాలో విచారణకు హాజరయ్యారు. ఆయనను విచారిస్తున్న పోలీసులు రవిప్రకాశ్‌ దర్యాప్తునకు సరైన రీతిలో సహకరించడం లేదని చెప్పడాన్ని బట్టే రవిప్రకాశ్‌ అరెస్ట్‌ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సైబరాబాద్‌లో గురువారం విచారణ జరుగు తున్న సమయంలో బంజారాహిల్స్‌ పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసు అందజేశారు. టీవీ9 లోగోను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలతో రవిప్రకాశ్‌పై నమోదైన కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రవిప్రకాశ్‌ తమ విచారణకు సహకరించడం లేదనే కారణాన్ని చూపి, ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Image result for banjara hilla acp Srinivasarao

అడ్డదిడ్డమైన సమాధానాలతో పోలీసులను గందరగోళానికి గురిచేసినట్లు మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి మాదిరిగా, చెప్పిందే చెప్పి విసిగించినట్లు సమాచారం. ఫోర్జరీ, షేర్లు, మెయిల్స్‌ డిలీట్‌ చేయడం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఆయనను ప్రశ్నించినట్లు తెలిసింది. ఒక వైపు సైబరాబాద్‌ పోలీసుల విచారణ జరుగుతుండగానే, బంజారాహిల్స్‌ ఏసీపీ శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని సీఆర్పీసీ 41-ఏ కింద నోటీసులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: