Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:32 pm IST

Menu &Sections

Search

నేడు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం

నేడు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం
నేడు వైసీపీ శాసనసభా పక్ష సమావేశం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 175 స్థానాల అసెంబ్లీలో ఏకంగా 151 సీట్లు సాధించిన ఆ పార్టీలో.. మంత్రిపదవులపై ఆశలు పెట్టుకున్నవారు సహజంగానే అధిక సంఖ్యలో ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారెవరో శుక్రవారం తేలిపోనుంది. సీనియర్లతో పాటు జూనియర్లు సైతం రేసులో ఉన్నారు.  ప్రతి లోక్‌సభా స్థానాన్ని జిల్లాగా మారుస్తానని.. తద్వారా రాష్ట్రంలో 25 జిల్లాలను ఏర్పాటు చేస్తానని జగన్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. 


అందుచేత ఆయన మంత్రివర్గంలో 25 మందికి అవకాశం కల్పించే అవకాశముందని అంటున్నారు. మంత్రివర్గంలో సీఎం, 25 మందికి స్థానం కల్పిస్తే.. 125 మంది ఎమ్మెల్యేలు మిగిలిపోతారు. వీరిలో ఒకరికి స్పీకర్‌గా, మరొకరికి డిప్యూటీ స్పీకర్‌గా, ఒక చీఫ్‌విప్‌, ఇద్దరు విప్‌లను నియమిస్తే.. ఇంకా 121 మంది ఉంటారు. వారిలో సీనియర్‌ శాసనసభ్యులు కూడా ఉన్నారు. మంత్రి పదవుల రేసులో చాలా మంది ఉన్నా.. కేబినెట్‌ కూర్పులో సామాజిక సమీకరణలు పాటించడం తప్పనిసరి. కొందరు సీనియర్లను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే వీలుండకపోవచ్చని.. పదవులు దక్కనివారు నిరాశచెందవద్దని జగన్‌ శుక్రవారం వైసీఎల్పీ భేటీలో నచ్చజెబుతారని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి..

కేబినెట్‌ పై కసరత్తు..
శనివారం అసెంబ్లీ ప్రాంగణం వెలుపల మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. కేబినెట్‌ కూర్పుపై చేసిన కసరత్తు గురించి శుక్రవారం వైసీఎల్పీ భేటీలో జగన్‌ వివరించనున్నట్లు తెలిసింది. ప్రజలు వైసీపీపై అపారమైన విశ్వాసం ఉంచి 151 స్థానాల్లో గెలిపించారని.. 22 మందిని లోక్‌సభకు పంపారని.. వారి విశ్వాసాన్ని పారదర్శక పాలనతో.. అవినీతి రహిత విధానాలతోనూ నిలుపుకోవాలని సీఎం జగన్ సూచించనున్నట్లు తెలుస్తుంది.. 

శనివారం చాంబర్లోకి సీఎం జగన్‌..
ముఖ్యమంత్రిగా జగన్‌ శనివారం సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మొదటి బ్లాకులోని సీఎం చాంబర్లోకి ప్రవేశించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది


ysrcp-cabinet-meeting-today
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విద్యుత్తు కోతల్లో లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక
17 ఏళ్ల నిరీక్షణతో రైలు మార్గం సుగమమం
రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేసుకున్నా పర్వాలేదు...ఆయ్‌...  గోదావరి జిల్లా ఉండాల్సిందేనండి..
రాష్ట్రంలో 24 గంటలపాటు వైద్య సేవలు బంద్‌
కార్పోరేట్‌, ప్రైవేటు బడి ఫీజులకూ కొలత పెట్టండి
నిప్పుల కుంపటిలా కోస్తా జిల్లాలు... ప్రకాశం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత
రాష్ట్రంలోచదువుల విప్లవాన్ని తీసుకువస్తా - ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి
"అమ్మ ఒడి"... ప్రైవేట్ కు సుడి
యోగాతో పరిపూర్ణ ఆరోగ్యం
స్పీకర్ తమ్మినేనికి అభినందనలు తెలిపేందుకు వెళ్తూ..
40 ఇయర్స్ ఇండస్ట్రీ కి ... ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్ధం కాలేదు
స్పీకర్ ఎలా ఉండాలో... సభా మర్యాదలంటే ఏంటో నేర్పుతాం : సి ఎం జగన్
ఆర్టీసీని విలీనం చేసుకోవ‌డం చారిత్రాత్మ‌కం..
పోలీసుల‌తో జ‌ర్న‌లిస్టులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి
స్పీకర్ హోదాకే కోడెల మచ్చ తెచ్చారు?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.