Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 12:39 pm IST

Menu &Sections

Search

మంత్రి వర్గం లో భూమన కు నోఛాన్స్ ?

మంత్రి వర్గం లో భూమన కు నోఛాన్స్ ?
మంత్రి వర్గం లో భూమన కు నోఛాన్స్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో కీలక నాయకుల్లో ఒకరైన భూమన కరుణాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి  మంత్రి వర్గం లో అవకాశం లేనట్లేనా ? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి. తాజాగా భూమన చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తిరుపతి లో జరిగిన ఒక సమావేశం లో భూమన మాట్లాడుతూ తనకు ఎటువంటి పదవులు అవసరం లేడన్న ఆయన , మంత్రి పదవి కూడా వద్దని పేర్కొనడం పరిశీలిస్తే, జగన్ కేబినెట్ లో భూమనకు  చోటు దక్కకపోవచ్చునని , అందుకే ముందుగానే ఆయన ఈ తరహా సంకేతాలు ఇచ్చి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా చేస్తున్నారు.


వైఎస్ కుటుంబానికి బంధువు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి విశ్వాస పాత్రుడైన నాయకుల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఒకరు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  తిరుపతి నుంచి ఆయన శాసనసభ్యునిగా గెలుపొందడం తోనే, భూమన కు మంత్రివర్గం లో ఛాన్స్ గ్యారంటీ అన్న ప్రచారం జరిగింది. అయితే భూమన మాత్రం మంత్రి మండలి ఏర్పాటుకు ముందే  తనకు పదవులేమి వద్దని ప్రకటించడం లో ఆంతర్యమేమిటో అంతుచిక్కక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.


వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో రెడ్డి సామజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అధిక సంఖ్య లో ఉన్నారు. వీరంతా మంత్రి పదవి ని ఆశిస్తున్నవారే కావడం తో, అధినేత కు మంత్రి వర్గ కూర్పు లో తలనొప్పి తగ్గించేందుకే తానే స్వచ్చందంగా ముందుకువచ్చి తనకు మంత్రి పదవి వద్దని ప్రకటించి ఉంటారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భావిస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా నుంచి ఒకరికి లేదంటే ఇద్దరికి మంత్రి వర్గం లో అవకాశం కల్పించే ఛాన్సుందని, అందులో  పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కి పక్క మంత్రి వర్గం లో బెర్త్ ఖాయం కాగా , ఇక రెండవ స్థానం కోసం హేమ, హేమీలు పోటీ పడుతున్న తరుణం లో భూమన మంత్రివర్గం రేసు నుండి ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుకుని ఉండి ఉంటారని అంటున్నారు. మంత్రి పదవి లేకపోయినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్ద  భూమన కు ఉండే ప్రాధాన్యత  భూమన కు ఉంటుందని కార్యకర్తలు చెబుతున్నారు. 



bhoomana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
అదేంటి చెవిరెడ్డి ...అంతమాట అనేశావు
ప్రేమలో ఫెయిలైన టాలీవుడ్ చందమామ
క్యాడర్ కు భరోసానిచ్చే నాయకత్వమే కరువు
టీఆరెస్ లో విలీనం సాంకేతికమే కానీ... నైతికం కాదు
జగన్ నిర్ణయం తో కేసీఆర్ కు పట్ట పగలే చుక్కలు ...
టి కాంగ్రెస్ అనవసరం గా రాద్ధాంతం చేస్తోంది...!
సభ నిర్వహణ వైకాపా ప్రభుత్వం  ప్రత్యేకత చాటుకుంటుందా?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.