కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికల తరువాత పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. కర్ణాటకలో జేడీఎస్.. కాంగ్రెస్ ఓటమికి ఒకరకంగా మండ్య నియోజక వర్గమే కారణం అని తెలుస్తోంది.  ఈ నియోజకవర్గం  నుంచి గతంలో పోటీ చేసి విజయం సాధించిన అంబరీష్ మరణం తరువాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.  
అంబరీష్ నియోజక వర్గం అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం  ఇవ్వాలని సుమలత కాంగ్రెస్  కాంగ్రెస్ పార్టీని కోరింది.  కానీ, కాంగ్రెస్ పార్టీ దానికి సుముఖంగా లేరు.  పైగా జేడీఎస్ తో పొత్తు కారణంగా ఆ నియోజక వర్గం జేడీఎస్  వెళ్ళింది. జేడీఎస్ అక్కడి నుంచి ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ గౌడనునిలబెట్టింది.  
దీంతో సుమలతకు కోపం వచ్చి అక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగింది. సుమలతకు సపోర్ట్ చేస్తూ బీజేపీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు.  దీంతో సుమలత భారీ మెజారిటీతో గెలిచింది.  బీజేపీ సపోర్ట్ చేయడంతో అక్కడి నుంచి గెలిచింది కాబట్టి సుమలత బీజేపీలో జాయిన్  అవుతుందని అనుకున్నారు.  
ఆ విధంగానే వార్తలు వచ్చాయి.  ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.  సుమలత బీజేపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా లేరట.  ఇండిపెండెంట్ గానే ఉండాలని నిర్ణయించుకుంది.  దీంతో బీజేపీ షాక్ తిన్నది.  అభ్యర్థిని పోటీలో నిలబెట్టకపోతే.. సుమలత విజయం సాధించేది కాదని, సుమలత షాక్ ఇచ్చిందని  బీజేపీ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: