కర్ణాటక రాజకీయాలు అనిశ్చితికి మారుపేరుగా మారిపోయాయి.  గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి  స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు.  కాంగ్రెస్.. జేడీఎస్ లు కల్సి  చేశాయి.  ఏ ముహూర్తాన ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయో.. అప్పటి నుంచి లుకలుకలు మొదలయ్యాయి.  
రెండు పార్టీలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.  పైగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు దారుణంగా ఓటమి పాలయ్యాయి.  ఈ ఓటమితో రెండు పార్టీలు ఢీలా పడ్డాయి.  కొంత మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు.  
అసమ్మతి  వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అయితే, ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది.  ఫలితంగా కూలిపోయే అవకాశం ఉంది.  ఇలా జరగకుండా ఉండాలంటే.. ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మరలా ఎన్నికలు పెట్టాలని, లేదంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంచాలని జేడీఎస్ నేత నిఖిల్ గౌడ అంటున్నారు.  
త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు  ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.  ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాలని పార్టీ శ్రేణులకు నిఖిల్ పిలుపునిచ్చారు. ఏడాదిలోపే ఎన్నికలు వస్తాయని నిఖిల్ మాట్లాడిన వీడియో ఇప్పుడు కర్ణాటకలో వైరల్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: