జగన్ విభిన్నమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. ఆయన ఇంట్లో వంట్లో రాజకీయం ఉన్నా కూడా  వ్యాపారంతోనే జీవితాన్ని ప్రారంభించారు. వైఎస్సార్ బతికి ఉంటే జగన్ ఇంత తొందరగా జనాల్లోకి వచ్చేవారు కాదు.  వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడంతా జగన్  బెంగుళూర్ నివాసం, తన బిజినెస్ తానేంటో. 


అటువంటి జగన్ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ కావడం వరకూ ఒకే కానీ. ఇలా జననేత అవుతానని బహుశా ఆయనే  అనుకోలేదేమో. దానికి ఎన్నో కారణాలు. మొత్తానికి జగన్ రాజకీయాలు తనకు తానే వంటబట్టించుకుని ఓ మోడల్ నేతగా మారారు. సహజంగా బిజినెస్ మెన్ తక్కువ మాట్లాడతారు. జగన్ కూడా మొదట్లో ఆచీ తూచీ  మాట్లాడేవారు. కొన్నాళ్ళ పాటు మీడియాతో కూడా ఆయన దూరం పాటించారు. 


ఇక జనంలోకి వచ్చాక జనమే ఆయన భాషగా మారారు. అయినా ఎక్కడ ఏది అవసరమో అంతే మాట్లాడడం జనం స్టైల్. జగన్ సభలకు లక్షలో జనాలు వస్తారు. అంత మంది జనాన్ని చూసి కూడా జగన్ గంటల తరబడి మాట్లాడనుకోరు. ఆయన చెప్పదలచుకుంది చెప్పేసి ముగించేవారు. జగన్ భారీ సభలైతే గంట వరకూ ప్రసంగం ఉండేది అది కూడా చాలా  రేర్ గా.  ఇక సీఎం అయ్యారు. దాంతో జగన్ మాటలు పూర్తిగా తగ్గిపోయాయి.


ఇపుడు ఓ వైపు అధికారులు మంత్రులు, అధికార ప్రతినిధులు, ఇంకో వైపు పార్టీ నేతలు ఇలా జగన్ గొంతు వినిపించడానికి ఎందరో ఉన్నారు. దాంతో జగన్ కి మాటలు వినే అవకాశం ఏపీ జనాలకు ఇపుడు  తక్కువే. ఇక పార్టీ వారికి కూడా తక్కువేనని చెప్పడానికి ఈ రోజు జరిగిన వైసీఎల్పీ భేటీ ఓ ఉదాహరణ. అక్కడ జగన్ మాట్లాడింది కేవలం పన్నెడు నిముషాలు అంటే నమ్మగలామా. ఎన్నో సంచలన విషయాలు ఆ సమయంలోనే జగన్ చెప్పేశారు.


నిజంగా  బ్యానర్ ఐటం లాంటి వార్తలను తన నోటితో చెప్పిన జగన్ మాట్లాడింది పట్టుమని పది నిముషాలు. నిజనే జగన్  నోటి మాటలు ముత్యాలే ఇపుడు. ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి. అందువల్ల ఆయన మాట, ఆలోచన, ప్రతి అడుగు అయిదు కోట్ల మంది ఆంధ్రులకు  సొంతం. 


మరింత సమాచారం తెలుసుకోండి: