Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:43 am IST

Menu &Sections

Search

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..హరీష్‌రావు ఈజ్ బ్యాక్..!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..హరీష్‌రావు ఈజ్ బ్యాక్..!
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..హరీష్‌రావు ఈజ్ బ్యాక్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ కేబినెట్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తెలంగాణలో రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ కేబినెట్‌లో తనయుడు కేటీఆర్, అల్లుడు హరీష్‌రావులను పక్కనపెట్టి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చాడు. తనతో పాటు సీనియర్ అయిన కడియం శ్రీహరిని సైతం పక్కన పెట్టిన పరిస్థితి. అయితే తనయుడు కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించిన కేసీఆర్ అల్లుడు హరీష్‌రావు మాత్రం పూర్తిగా పక్కనపెట్టాడు. అసలు పార్టీలో ఏ బాధ్యతలు అప్పగించకుండా హరీష్‌రావును పక్కనపెట్టడం వెనుక తన కొడుకు కేటీఆర్‌ సీఎం పదవికి అడ్డం రాకుండానే అని గులాబీ నేతల్లో పాటు ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది. పార్టీపై హరీష్‌రావుకు ఉన్న పట్టు ఏంటో సీఎం కేసీఆర్‌కు తెలుసు. ఇప్పటికిప్పుడు హరీష్ రావు పార్టీని వీడి బయటకు వెళితే ఆయనతోపాటు 50 ఎమ్మెల్యేలు కూడా వెళతారని తెలుసు. అందుకే ముందుగా కొడుకు కేటీఆర్‌కు పట్టం కట్టి..పార్టీలో పట్టు సాధించేలా చేశాడు. అన్ని ఎన్నికల బాధ్యతలను కేటీఆర్‌కే అప్పగించాడు. పార్టీలో కేటీఆర్‌కు అంతా విధేయులుగా ఉండేలా కేసీఆర్ స్కెచ్ వేశాడు. 


అయితే హరీష్ రావు సమర్థత ఏంటో కేసీఆర్‌కు తెలుసు కనుకే ఆయన్ని ఉద్దేశ్యపూర్వకంగా  పక్కన పెట్టాడు. ఆఖరికి కేసీఆర్ మానసపుత్రిక నమస్తే తెలంగాణ, టీ న్యూస్‌లో కూడా హరీష్‌రావుపై పెద్దగా న్యూస్ వేయని పరిస్థితి వచ్చింది. మరోవైపు మామ నిరాదరణ, పార్టీలో ఎదురువుతున్న అవమానాలను దిగమింగుకుంటున్న హరీష్ రావు కేవలం సిద్ధిపేటకే పరిమితమై తన పని తాను చేసుకుంటున్నాడు.  తాజాగా హరీష్‌రావు తన పుట్టిన రోజుకు ఎవరికి అందుబాటులో ఉండడం లేదంటూ ఆవేదనగా పెట్టిన పోస్టు తెలంగాణ ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఎంతగా అభిమానిస్తారో..అంతకంటే మిన్నగా హరీష్‌రావును అభిమానిస్తారు. ఒక వేళ హరీష్‌రావు సీఎం క్యాండిడేట్‌గా నిలబడితే కచ్చితంగా గెలిపించి తీరుతారు...అంతలా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు హరీష్‌రావు. అలాంటి నాయకుడిని సీఎం కేసీఆర్ పక్కనపెట్టడంపై తెలంగాణ ప్రజలు కూడా అసలు టీఆర్ఎస్ పార్టీలో  ఏం జరుగుతోంది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు అన్నీ కేటీఆర్‌కే అప్పగించిన కేసీఆర్..హరీష్‌రావుని కేవలం మెదక్‌ ఎంపీ స్థానానికే పరిమితం చేశాడు. ఫలితం ఏంటో తెలిసిందిగా కేటీఆర్ బాధ్యత తీసుకున్న స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు గెలవగా, హరీష్‌రావు ఇన్‌చార్జ్‌గా ఉన్న మెదక్‌ లోక్‌సభ స్థానంలో మాత్రం 3 లక్షలకు పైగా మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచింది. దీంతో హరీష్ రావు సత్తా ఏంటో మరోసారి రుజువైంది. హరీష్‌కు ఉన్న మాస్  ఛరిష్మా, రాజకీయ చాణక్యం  కేటీఆర్‌కు లేవని తేలిపోయింది. దీంతో సీఎం కేసీఆర్‌లో అంతర్మథనం మొదలైంది. మరోవైపు హరీష్‌రావును పక్కనపెట్టడమే కాకుండా ఆయన్ని ఘోరంగా అవమానించేలా వ్యవహరించడంపై కేసీఆర్, కేటీఆర్ పట్ల టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సోషల్ మీడియాలో హరీష్‌రావు తెలంగాణకు కాబోయే సీఎం అని ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు పోస్టులు పెడుతుండంతో కేసీఆర్ అలెర్ట్ అయ్యాడు. హరీష్‌రావును ఇలాగే పక్కన పెడితే పార్టీ రెండుగా చీలే అవకాశం ఉందని గమనించిన కేసీఆర్ ఆయన్ని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోవాలని డిసైడ్ చేసినట్లు సమాచారం.  


కేబినెట్‌ ప్రక్షాళన‌కు నడుం బిగించిన సీఎం కేసీఆర్ తన అల్లుడు హరీష్‌రావుతో పాటు కొడుకు కేటీఆర్‌, సీనియర్ నేత కడియం శ్రీహరిని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల్లో టీఎస్ కేబినెట్‌లో మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు మంత్రులు తలసాని, మల్లారెడ్డికి ఉద్వాసన పలికి, కేటీఆర్, హరీష్‌రావులను కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు సమాచారం. తలసాని తన కొడుకు సాయికిరణ్‌‌ను సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి గెలిపించుకోలేకపోవడంతో కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నాడు. అలాగే మల్కాజ్‌గిరి నుంచి పట్టుబట్టి తన అల్లుడి మర్రి రాజశేఖర్ రెడ్డిని నిలబెట్టిన మంత్రి మల్లారెడ్డి ఆయన్ని గెలిపించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అక్కడ తనకు అసలే ఏ మాత్రం పడని రేవంత్ రెడ్డి గెలవడంతో సీఎం కేసీఆర్ మంత్రి మల్లారెడ్డి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ ఇద్దరు మంత్రులపై వేటు వేసి మళ్లీ తన కేబినెట్‌లోకి కొడుకు, అల్లుడుని తీసుకున్నట్లు సమాచారం. హరీష్‌రావుకు మళ్లీ ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ పార్టీలో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్‌ చెప్పనున్నట్లు సమాచారం. మొత్తంగా హరీష్ రావు కేబినెట్‌లోకి రావడం తెలంగాణ రాజకీయాల్లో సంచనలంగా మారింది. హరీష్ రావు అభిమానులు మాత్రం..ఎంత అణగదొక్కితే అంత పైకి లేస్తాడు మా నాయకుడు..దటీజ్ హరీష్‌రావు..అంటూ సంబురాలు చేసుకంటున్నారు. మొత్తానికి హరీష్ ఈజ్ బ్యాక్.. ప్రత్యర్థులకు ఇక చుక్కలు చూపిస్తాడనడంలో ఎటువంటి సందేహంలేదు..ఎందుకంటే అక్కడున్నది హరీష్ రావు మరి..


big senstation..Harish rao is back to cabinet...!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.