గత నెల 23న ఏపిలో పెను సంచలనాలు జరిగాయి... అప్పటి వరకు అధికార పార్టీలో ఉన్న సభ్యులు ఖంగు తినేలా..ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ ప్రభంజనం సృష్టించింది.  175 అసెంబ్లీ సీట్లకు ఏకంగా 151 సీట్లు గెల్చుకొని ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.  గత నెల 30 న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.  రేపు ఉదయం వైఎస్ జగన్ తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఉదయం 8:39 గంటలకు జగన్ సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం కార్యాలయం ఉంది.

ఇదిలా ఉండగా, రేపు ఉదయమే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం సమీపంలోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కేబినెట్ తొలి భేటీ జరగనున్నట్టు సమాచారం. ఉదయం 11:49 గంటలకు జగన్ తొలి మంత్రివర్గం భేటీ కానుంది జగన్‌ మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేయించేందుకు గాను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ గురువారం మధ్యాహ్నం విజయవాడకు చేరుకొన్నారు. వి

జయవాడలోని గేట్‌వే హోటల్‌లో గవర్నర్ దంపతులకు బస ఏర్పాటు చేశారు.  ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. పాసులు ఉన్నవారికే గ్యాలరీలోకి ఎంట్రీ అవకాశం కల్పిస్తారు. మంత్రివర్గసభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి  1500 మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: