శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన ప్రసాదరావుది ఒక హావా. ఆయన వైఎస్సార్ జమానాలో మంత్రి అయ్యారు. అయితే ఆ తరువాత విభజనతో కాంగ్రెస్ చిత్తు కావడంతో జగన్ వైపు వచ్చారు, అంతకు ముందే పార్టీలో ఉన్న అన్న క్రిష్ణదాస్ జగన్ వెంట అడుగులు వేశారు. దాంతో విధేయతకు జగన్ పెద్ద పీట వేశారు.


ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి వస్తుందని అంతా ఆశించినా చివరికి  అది అన్న గారు తన్నుకుపోయారు. ఐతే ఒకే కుటుంబం కాబట్టి పెద్దగా ఇబ్బందులైతే లేవు. దాంతో ధర్మాన సైతం అన్నకు సహకరించే అవకాశాలు ఉన్నాయి.


ఇదిలా  ఉండగా ధర్నాన ప్రసాదరావు మీద గతంలో మంత్రిగా ఉన్నపుడు కొన్ని ఆరోపణలు రావడంతో ఆయన్ని వెనక్కు పెట్టారని కూడా అంటున్నారు. ఇక తాజా ఎన్నికల్లో వైసీపీ ఎంపీ దువ్వాడ శ్రీను  ఓటమి వెనక కూడా అయన సహాయ నిరాకరణ ఉందని అంటున్నారు. మొత్తానికి ప్రసాదరావుకు ప్రసాదం దక్కలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: