దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా... అందరిచూపులు ఒక వ్యక్తివైపే ఉంటాయి.  ఆ ఒక్కడు ఎవరో కాదు ప్రశాంత్ కిషోర్.  బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ 2014 ఎన్నికల  సమయంలో మోడీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించారు.  ఆ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది.  


ఈ విజయం తరువాత ప్రశాంత్ కిషోర్ పేరు బయటకు వచ్చింది.  అక్కడి నుంచి ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో నితీష్ కు పనిచేశారు.  అక్కడ నితీష్ కుమార్ కూడా విజయం సాధించింది.  యూపీ ఎన్నికల్లో మాత్రం వ్యూహం బెడిసికొట్టింది.  కాంగ్రెస్ పార్టీకి పనిచేసినా వర్కౌట్ కాలేదు.  


కాగా 2017 సంవత్సరంలో ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ లో వైకాపా తరపున పనిచేసునేందుకు రెడీ అయ్యారు.  ఫలితం వైకాపా విజయం.  అది తిరుగులేని విజయం.  దీంతో బెంగాల్ మమతా బెనర్జీ చూపులు ప్రశాంత్ పైపడ్డాయి .  ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా తీసుకోవాలని నిర్ణయించుకుంది. 

ఈరోజు ప్రశాంత్ కిషోర్ తో రెండు గంటల సేపు దీదీ మాట్లాడారు.  ఇది నితీష్ కుమార్  కు నచ్చలేదు.  పార్టీ వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయనను తొలగించారు. ప్రశాంత్ కిషోర్ కు జెడియు పార్టీతో ఇకపై సంబంధాలు ఉండవని ఆ పార్టీ తేల్చి చెప్పింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: