వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల్లో ఒకరు రోజా.  నగరి నుంచి రెండుసార్లు నగరి నుంచి విజయం సాధించింది.  రెండో సారి ఎన్నికైన తరువాత వైకాపా ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చాడు.  జగన్ అధికారంలోకి వచ్చాడు అంటే రోజాకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు.  


అయితే, మొదట స్పీకర్ అనుకున్నా కుదరలేదు.  తరువాత మంత్రి పదవి అనుకున్నారు.  చివరకు అది ఇవ్వలేదు.   హోమ్ మినిస్టర్ పదవిని మహిళకు కేటాయిస్తారని వార్తలు వచ్చాయి.  అది రోజానే అనే ఉహాగానాలు కూడా వచ్చాయి.  చివరకు రోజాకు చేదు అనుభవమే ఎదురైంది.  


పార్టీలో ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నానని, జగన్ అన్నపై భరోసా ఉందని, తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ధీమాను వ్యక్తం చేసింది.  కానీ, చివరకు వచ్చేసరికి రోజాకు జగన్ హ్యాండ్ ఇచ్చారు.  మంత్రి పదవి కాదుకదా కనీసం డెప్యూటీ పదవి కూడా ఇవ్వలేదు. 


అయితే, మంత్రి పదవుల్లో ఇప్పుడున్న మంత్రులు ఐదేళ్లు కొనసాగరు.  రెండేళ్ల తరువాత ఇప్పుడున్న మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలి.  వారి స్థానంలో కొత్త మంత్రులు వస్తారు. సో, ఇప్పుడు ఛాన్స్ మిస్ అయినా.. రెండేళ్ల తరువాత రోజాకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది.  అప్పుడైనా జగన్ అన్నా ఈ నగరి చెల్లెమ్మకు మంత్రి పదవి ఇస్తారో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: