వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే వ్యక్తుల్లో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు.  వైకాపా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి రోజా తోడుగా ఉన్నది.  జగన్ వెంట నడిచింది.  అసెంబ్లీలో తన వాయిస్ ను బలంగా వినిపించింది.  జగన్ ఎక్కడైనా తగ్గాడేమోగాని రోజా మాత్రం అస్సలు తగ్గలేదు. 


దీంతో ఆమెను అప్పట్లో అసెంబ్లీ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు.  ఇప్పుడు వైకాపా అధికారంలోకి వచ్చింది.  రోజాకు మంత్రి పదవి ఇస్తారని కాసేపు, ఇవ్వడం లేదని కాసేపు వార్తలు వచ్చాయి.  ఏ వార్తను నమ్మాలో దేన్నీ నమ్మకూడదో అర్ధం కానీ పరిస్థితుల్లో  పడిపోయారు ప్రజలు.  


దీనికి ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది.  వైఎస్ జగన్ నుంచి రోజాకు స్వయంగా ఫోన్ వచ్చిందని.. వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో జరిగే ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని ఫోన్ వచ్చిందట.  దీంతో రోజాకు పదవి ఖాయం అయ్యిందని మరలా వార్తలు వస్తున్నాయి.  


రోజా విషయాన్ని ఇలా ఎందుకు సస్పెన్స్ లో పెడుతున్నారో అర్ధం కావడం లేదు.  కాసేపు వస్తుంది అని కాసేపు రావడం లేదని చెప్పడం వెనుక అర్ధం ఏంటి.. రోజా వంటి నాయకురాలికి ఎలాంటి పోస్ట్ ఇవ్వాలో తెలియని పరిస్థితుల్లో వైకాపా ఉన్నదా అనే డౌట్ వస్తున్నది.  మరి ఏ పోస్ట్ వెలగపూడిలో గాని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: