Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 19, 2019 | Last Updated 7:02 pm IST

Menu &Sections

Search

రవిప్రకాష్ అరెస్టుకు రంగం సిద్ధం కాగా గరుడ శివాజీ అమెరికా ఉడాయించారా!

రవిప్రకాష్ అరెస్టుకు రంగం సిద్ధం కాగా గరుడ శివాజీ అమెరికా ఉడాయించారా!
రవిప్రకాష్ అరెస్టుకు రంగం సిద్ధం కాగా గరుడ శివాజీ అమెరికా ఉడాయించారా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వెండితెర న‌టుడు శొంఠినేని శివాజీ. బ‌హుశ ఇలా అంటే గుర్తు ప‌ట్టేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. గ‌రుడ పురాణం శివాజీ అంటే నిముషాల్లోనే గుర్తుకు వ‌చ్చేస్తాడు. బ‌హుశా త‌ను నటించిన మూవీల్లో కంటే.. ఈ గ‌రుణ పురాణాల ద్వారా క్రేజ్‌ని భారీగా సొంతం చేసుకున్నాడు.  టివి 9 రవిప్రకాష్ ఇక అరెస్టు కావటమే తరువాయి, తోటి ముద్దాయి గరుడ పురాణం శివాజి వైపు తాజాగా పోలీసుల దృష్టి మరలింది. ఇంతకాలం గా తప్పించుకు తిరుగు తున్న శివాజి కొసం వేట మొదలైందని అంటున్నారు.  టివి 9 వివాదంలో చిక్కుకున్న గరుడ  శివాజీ దేశం దాటేసారా! లేక వేషాలు మార్చి పోలీసు ల కళ్ళముందే తిరుగు తున్నారా!  తాజాగా శివాజీ కోసం జల్లెడపట్టి గాలిస్తున్న తెలంగాణా పోలీసులకు అనుమానాలు తలెత్తుతున్నాయి.
sonthineani-sivaji-ekkada
రెండు రాష్ట్రాల్లో తనకు వ్యతిరేక ప్రభుత్వాలే ఉండటంతో ఫోర్జరీ కేసులో అడ్డంగా బుక్ అయిన శొంఠినేని శివాజీకి ఇప్పుడు రక్షణ ఇచ్చేవారు సైతం కరువయ్యారు. తెలంగాణ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శొంఠినేని శివాజీ కదలికలు కనిపెడుతూ ఉండటంతో మొబైల్-ఫోన్, ఇంటర్నెట్ వాడకాలకు దూరంగా శివాజీ ఉన్నట్లు చెబుతున్నారు. తనపై కేసులు నమోదయ్యాక తప్పించుకునేందుకే గరుడ శివాజీ గుండు గీయించు కున్నట్లు తెలుస్తుంది.

రకరకాల విగ్గులతో వేషాలు మారుస్తూ ఉండేందుకే బోడిగుండు అంత ఉత్తమం లేదన్న అంచనాతో శొంఠినేని శివాజీ ఈ పని చేసినట్లుగా పోలీసులు సైతం అనుమానిస్తు న్నారు. ఈ మారువేషం లోనే శ్రీలంకకు సముద్ర మార్గాన చేరుకున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు.

"విజిల్ బ్లోయర్స్ యాక్ట్,  పీనల్  కోడ్ సెక్షన్ల గురించి ఉపన్యాసాలు దంచిన గరుడ పురాణం శొంఠినేని శివాజీ పరారీలో ఎందుకున్నాడో! తన జాతకం తనకే తెలిసి పోయిందా!  రవిప్రకాష్ రక్షిస్తాడనుకుంటే ఆయనే రోడ్డున పడ్డాడు. ఫోన్లో కూడా దొరకట్లేదంటగా?"  అంటూ జనాలు ఎద్దేవా చేస్తున్నారు


ప్రస్తుతం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో లుక్-అవుట్ నోటీసులు జారీ అయినందున శ్రీలంక నుంచి అమెరికా ఇతర దేశాలకు పారిపోయి ఉండొచ్చని నిఘా విభాగం భావిస్తుంది. ఇప్పటికే ఫోర్జరీ కేసులో రవి ప్రకాష్ పోలీసుల ముందు మూడుసార్లు హాజరయ్యారు. ఇక ఈ కేసులో మరో నిందితుడు మూర్తి సైతం పోలీసుల ముందుకు వస్తున్నారు.


రవిప్రకాష్ కు అరెస్ట్ తప్పకపోతే పోలీసుల ముందు హాజరు కాకుండా తప్పించు కోవాలని శొంఠినేని శివాజీ వ్యూహంగా కనిపిస్తుందని పోలీసులు అనుకుంటున్నారు.  టీవీ9ను కొనుగోలు చేసిన కొత్త యాజమాన్యం శొంఠినేని శివాజీతో కలసి ఇప్పటి వరకూ సీఈవోగా ఉన్న రవిప్రకాష్ కుట్ర చేశారని ఆరోపిస్తోంది. రవిప్రకాష్ కు చెందిన షేర్లను ఉద్దేశపూర్వకంగానే శివాజీకి బదలాయించినట్లు చూపించి, ఆయనతో ఎన్సీఎల్టీలో కేసు వేయించారనేది నూతన యాజమాన్యం ఆరోపణ. మొత్తానికి ప్రపంచం మొత్తం చుట్టిన శివాజీ గ‌రుణ పురాణం త‌న దాకా వ‌చ్చేస‌రికి మాత్రం ఏమీ చెప్పలేక పోవ‌డం గ‌మ‌నార్హం.


sonthineani-sivaji-ekkada
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జపాన్ వాళ్ళంతే - మిర్రర్ న్యూరాన్ల స్పందన ఎక్కువట? అందుకే అలా తయారయ్యారు!
షాకింగ్! బీజేపిలోకి సుజానా!
గోవు పరమ పవిత్రం - గోవు వలన ప్రయోజనాలు
ఎడిటోరియల్: దేశంలో ఏ ఇతర నాయకునికి లేని ఆ రోగమే చంద్రబాబు కొంప ముంచింది?
సండే స్పెషల్: చీరకట్టు - కనికట్టు - చీరలో మన హీరోయిన్స్
పదవి పోయినా ఆ ఫోజు మారలేదు - ఇంగువ కట్టిన గుడ్డ వాసన పోనట్లు - టిడిపి గతి అంతే!
ఏపికి ప్రత్యేక హోదా అత్యవసరం, ఇచ్చి ఆదుకోండి : సీఎం వైఎస్ జగన్
పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి “పవన”మో! పలాయనమో!
"షా" వెరైటీ మామిడి పండు - అమృతఫలం రుచి, రూపం, బరువు అద్భుతం
ఈ పిల్ల అందాలకు జిమ్ బయట ఇంటి బయట కాపలా పెట్టాల్సిందే!
About the author