2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం చాలా కష్టపడింది ఒక వర్గం మీడీయా. జగన్మోహన్ రెడ్డిపై ఉన్నవీ లేనివీ రాస్తూ విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుభవం ఉన్న చంద్ర బాబు నాయుడే రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించగలడని ప్రజల్లో భ్రమలు కల్పించింది ఆ మీడియా.ఫలితంగా 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు.

 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నాలుగున్నర సంవత్సరాల పాటు నెరవేర్చకుండా చివరి ఆరు నెలల్లో పథకాలను అమలు చేయటం ప్రారంభించారు. ఈ విధానాల వల్ల తెలుగు దేశం పార్టీపై ఆంధ్ర ప్రదేశ్లో విపరీతమైన వ్యతిరేఖత వచ్చింది. పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు ప్రారంభించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాలన్నీ తెలిసినా ఆ వర్గం మీడియా చంద్రబాబు పాలనను సమర్థిస్తూనే కథనాలు రాసింది


2019 ఎన్నికలకు ముందు కూడా తెలుగు దేశం పార్టీనే గెలుస్తుందనే విధంగా ప్రచారం చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు దాకా కూడా ఫేక్ సర్వేలతో తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని ప్రచారం కల్పించింది ఆ వర్గం మీడియా చంద్రబాబు గారికి నిజాల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించి ఉంటే తెలుగు దేశం పార్టీ మెరుగైన ఫలితాలు సాధించేదేమో


మరింత సమాచారం తెలుసుకోండి: