వైఎస్ జగన్ తొలి సంతకం  ఎపుడు పేదల వైపే ఉంటుంది. బడుగుల చూపే కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తరువాత ఆయన విజయవాడ మైదానంలో జనం మధ్యన చేసిన తొలి సంతకం వ్రుద్ధులకు పించన్లు 2,250 రూపాయలు పెంచుతూ  కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక ఇపుడు జగన్ సచివాలయానికి ఈరోజు వచ్చారు.


ఆయన ముఖ్యమంత్రిగా పాలనను ఇక‌ అంతా అక్కడ నుంచే చేయాలి వేద మంత్రాల  మధ్య సంప్రదాయంగా జగన్ సచివాలయం ప్రవేశం చేశారు. బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్భంగా తొలి సంతకం మళ్ళీ కీలకం అయింది. ఆశా వర్కర్లకు మూడు వేల నుంచి పది వేలు గౌరవ వేతనం పెంచుతు జగన్ తన తొలి సంతకం చేశారు.అదే విధంగా అనంతరం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ ఫైల్‌పై సీఎం జగన్‌ మూడో సంతకం చేశారు.


 మొత్తానికి సీఎం ప్రతి సంతకం విలువ మనవత్వమని, పేదలకు బతుకు బాట అని చెప్పకనే చెబుతున్నారు. నిజానికి ముఖ్యమంత్రి సంతకాలు కొన్ని వేలల్లో, లక్షల్లో ఈ అయిదేళ్ళు చేయవచ్చు. కానీ అందులో ప్రజల కన్నీరు తుడిచే సంతకాలు ఎన్ని అన్న ప్రశ్న వేసుకున్నపుడు జగన్ కచ్చితంగా మంచి మార్కులే సంపాదిస్తారన్నది నిజం.



మరింత సమాచారం తెలుసుకోండి: