Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 10:11 pm IST

Menu &Sections

Search

హోదా ముగిసినా అధ్యాయమేనా ?... జగన్ స్టాండ్ ఏమిటీ??

హోదా ముగిసినా అధ్యాయమేనా ?... జగన్ స్టాండ్ ఏమిటీ??
హోదా ముగిసినా అధ్యాయమేనా ?... జగన్ స్టాండ్ ఏమిటీ??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమేనా ? అంటే అవుననే ఆంధ్ర ప్రదేశ్  బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అంటున్నారు. ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి ప్రజల్ని మభ్య పెట్టవద్దని పరోక్షంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు.  ప్రత్యేక హోదా అసాధ్యమనే, ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ప్యాకేజీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేస్తున్నారు. గత ఐదేళ్ల లో హోదా కంటే ఎక్కువే చేశామని కన్నా చెప్పుకొచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనే లక్ష్యమని చెబుతున్న వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, బీజేపీ అవలంభిస్తోన్న  విధానం పై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు  ఆసక్తికరంగా మారింది.


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అసాధారణ విజయం అందించి, అంతే చిత్తుగా తెలుగుదేశం పార్టీని ఓడించడానికి హోదా పై ఆ పార్టీ తరుచూ తన విధానాన్ని మార్చుకోవడం కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హోదా పై మొదటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే విధానాన్ని అవలంభించడం వల్లే ఆ పార్టీ పై  విశ్వాసం  తోనే  ప్రజలు  నమ్మి ఓట్లేసి 151  అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టారని పేర్కొంటున్నారు. అయితే  ఆంధ్ర ప్రదేశ్ కు  ప్రత్యేక హోదా ఇచ్చేనందుకు కేంద్రం లోని బీజేపీ నేతృత్వం లోని ఎన్డీఏ సర్కార్ సిద్ధంగా లేదని కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమయింది. గతం లోను ఇదే వైఖరి అవలంభించడం వల్లే బీజేపీ కి మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ తో  తెగతెంపులు చేసుకుని, కేంద్ర మంత్రి వర్గం నుంచి బయటకు రావడమే కాకుండా, చివరకు ఎన్నికల్లో  అమితుమీ తేల్చుకునేందుకు ఎన్నికల్లో సిద్ధపడింది.  బీజేపీ తో ప్రస్తుతం  అనధికారిక మైత్రిని కొనసాగిస్తోన్న జగన్మోహన్ రెడ్డి, హోదా సాధనకు ఎటువంటి  స్టాండ్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


 హోదా సాధన ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావిస్తోన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు కేంద్రం తో ఘర్షణాత్మక వైఖరి అవలంభించుకున్న, భవిష్యత్తు లో కూడా హోదాపై కేంద్రం ఇదే  నాన్చుడు ధోరణి అవలంభిస్తే , అమితుమీ తేల్చుకోక తప్పని పరిస్థితి నెలకొంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హోదా పై కేంద్రం తన స్టాండ్ కు కట్టుబడి ఉన్నా జగన్ మెతక వైఖరి అవలంభిస్తే మాత్రం , అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టిన గతే భవిష్యత్తు లో వైస్సార్ కాంగ్రెస్ కు పెట్టె ప్రమాదముందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.


kanna-jagan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా హీరోల చిత్రాల్లో  ఆ కమెడియన్ కు  నోఛాన్స్
అవును ..అడల్ట్ ఫిల్మ్ చూశానన్న టాలీవుడ్ హీరోయిన్
కోమటిరెడ్డి సోదరుల మధ్య బేదాభిప్రాయాలు
బాబును ఆ ఇల్లు ఖాళీ చేయించి తీరుతాం
టీడీపీ ఓటమికి కొత్త కారణం చెప్పిన రోజా
పార్టీ మారడానికి  150 కోట్లు ... మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారట
టీడీపీ ని వీడనున్న గంటా ?
జూనియర్ ను రాజకీయాల్లో ప్రజలు ఆదరించరు
అప్పుడు కాదన్నా వల్లే ... ఇప్పుడు కావాలంటున్నారట
బాబు తప్పులనెంచుతోన్న చౌదరి
నూతన సచివాలయ భవనాల నిర్మాణం అవసరమా ?
గుణ 369 ... మరో ఆర్ ఎక్స్ 100  అవుతుందా?
మాజీ భార్య అన్నందుకు రేణు కు కోపం వచ్చింది
రాజగోపాల్ రెడ్డి తో కలిసి నడిచేది ఎవరెవరు ?
పాక్ పై భారత అజేయ రికార్డు పదిలం
కమలదళం లోకి కోమటిరెడ్డి బ్రదర్స్ ?
చెరో దారిలో కోమటిరెడ్డి సోదరులు ?
పటాస్ రేటింగ్స్ శ్రీముఖి ఎఫెక్ట్
టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు జగన్ సర్కార్ షాక్
జూనియర్ వల్ల టీడీపీకి  ప్రయోజనం శూన్యం
బాలయ్య డైలాగ్ కు రివర్స్ పంచ్ వేసిన విజయసాయి
పెళ్లి పీటలు ఎక్కనున్న రెజీనా ?
యోగ ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం ... మానసిక ప్రశాంతత
జెన్నీ సెకండ్ ఇన్నింగ్స్ త్వరలో స్టార్ట్
 సత్ఫలిస్తోన్న జగన్ సఖ్యతమంత్రం ...రాష్ట్రానికి నిధుల వరదేనా ?
హీరో కంటే ఆ హీరోయిన్ రేమ్యునేషనే అధికం
జగన్మోహనాస్త్రం తో తెలుగు చంద్రులిద్దరు ఉక్కిరి, బిక్కిరి
విమానాశ్రయం లో బాబుకు తప్పని తనిఖీ
ఆమ్మో ... వైకాపా లో చేరడమే
రెండవ పెళ్లి కి రేణు దేశాయ్ రెడీ
ఫిరాయింపు రాజకీయాలు చేసేది లేదు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.