ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వెళ్లి అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో కాలం చేశారు.  ఆయన రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని ఎదిరించి సొంతంగా వైఎస్సార్ సీపీ ని స్థాపించి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయగా ప్రతిపక్ష హోదాకే పరిమితం అయ్యారు.

కానీ ఆయన ప్రజల కోసం సేవచేయాలనే తపనతో తన తండ్రి బాటలో నడిచారు. ఏసీ రూముల్లో కూర్చుంటే ప్రజల కష్టాలు తెలియవని..వారి మద్యలోకి వెళ్తేనే వారి కష్టాలు తెలుస్తాయని ‘ప్రజా సంకల్ప యాత్ర’చేసి 3000 కిలోమీటర్లు నడిచి ఏపి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు.  రాజన్న మళ్లీ వచ్చాడనే భరోసా ఇచ్చాడు.  అందుకే ఆయనకు మొన్న జరిగిన లోక్ సభ, రాజ్య సభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని కట్టబెట్టారు ఏపి ప్రజలు.  


ఈ నేపథ్యంలో గత నెల 30న ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.  ఈ నేపథ్యంలో నేడు ఆయన సచివాలయంలోకి అడుగు పెట్టిన మొదటి రోజే మొదటి ఫైల్ పై సంతకం ఆశ వర్కర్లు జీతం 3,000 నుండి 10,000 రూపాయలకు పెంచిన ఫైల్ పై మొదటి సంతకం.. అనంత ఎక్స్ప్రెస్ హైవే అనుమతులకొఱకు సంబంధించిన రెండవ ఫైల్ పై సంతకం.. జర్నలిస్ట్ ఇన్సూరెన్స్ పరిమితి 10, లక్షల రూపాయలవరకు పెంచిన ఫైల్ పై మూడవ సంతకం చేశారు. 

★ గుర్తుకొస్తున్నాయ్.. గుర్తుకొస్తున్నాయ్... వద్దన్నా అన్నీ గుర్తుకొస్తున్నాయ్..
.
★ 2014 లో జగన్ వెంట్రుకవాసిలో అధికారానికి దూరమయ్యాక నిర్వేదంలో కూడా నిబ్బరంగా కనిపించిన ఆ చిత్రాలు గుర్తుకొస్తున్నాయ్..
.
★ ఆందోళనలో ఉన్న జగన్ ను చూసి చంద్రబాబు చేసిన వికటాట్టహాసాలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
.
★ తమ భవిష్యత్తు  ఏమిటో అంటూ నీరుగారిపోయిన జగన్ శిబిరాన్ని చూసి చంద్రబాబు పొందిన పైశాచికానందం తాలూకు జ్ఞాపకాలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
.
★ తీవ్ర నిస్పృహలో ఉన్న  జగన్ కుటుంబసభ్యులను చూసి చంద్రబాబు కూసిన లేకికూతలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
.
★  అసెంబ్లీలో జగన్ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకొంటున్న  దృశ్యాలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
.
★ ప్రతిపక్ష నాయకుడు అన్న కనీస గౌవరం లేకుండాజగన్ మీద  విపరీతమైన ఛీత్కారభావంతో చంద్రబాబు చేసిన వెటకారాలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
.
★ లేకితనంతో స్పీకర్ పదవికే మచ్చ తీసుకొచ్చిన కోడెల ఆగడాలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
★ పవిత్రమైన అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హతకూడా నీకులేదు అంటూ జగన్ ని చంద్రబాబు తీవ్రంగా అవమానించిన సీన్లు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
.
★ అసెంబ్లీలో ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడానికి మంత్రివర్గం మొత్తంగా ఏకమైనా నిలువరించలేక చివరికి అసెంబ్లీనే వాయిదా వేసిన చేతగాని సందర్భాలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
.
★ అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షనాయకుడు మాట్లాడే సందర్భాల్లో పనిగట్టుకొని వ్యక్తిగత దూషణలు చేస్తున్న పచ్చ గుంపుల ఆగడాలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
.
★ ఐదేళ్లలో  అడుగడుగునా జగన్ ను నాశనం చేయాలని విపరీతమైన అధికార దుర్వినియోగం చేసిన సందర్భాలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
.
★ చివరికి జగన్ బ్రతికి ఉంటే ఇక తనని ఆపలేము అన్న భయంతో ఏకంగా తనని చంపేసే దుర్మార్గమైన ప్రయత్నాలు కూడా వద్దన్నా  గుర్తుకొస్తున్నాయ్..
.
★ హత్యాయత్నాన్ని కోడికత్తి అంటూ వెటకారంగా కొట్టిపడేసి, పబ్లిసిటీ స్టంట్ అని చంద్రబాబు కూసిన లేకికూతలు వద్దన్నా గుర్తుకొస్తున్నాయ్..
ఒకటేమిటి ఐదేళ్లలో చంద్రబాబు చేయని దారుణం లేనేలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చంద్రబాబు కుయుక్తులు సాగలేదు. జనాలు బాబుని నమ్మలేదు. చంద్రబాబు తన జీవితంలో చేసిన దారుణాలకి జీవిత చరమాంకంలో  ఇక కోలుకోలేని విధంగా, అత్యంత అవమానకర ఓటమిని చవిచూశాడు. ఒక రాజకీనాయకుడు ఏవిధంగా ఉండకూడదు అన్నది చంద్రబాబును చూస్తే చాలు..
.
★ చంద్రబాబు చేసిన తప్పులనూ, పొరపాట్లనూ జగన్ చేయకూడదు..
.
★ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలకు చంద్రబాబు ఒక Wrong Example గా నిలిచేలా జగన్ పాలన ఉండాలి..
.
★ రేపు మంత్రివర్గ బాధ్యతలు స్వీకరించి పరిపాలన మొదలుపెడుతున్న సందర్బంగా జగన్ కూ వారి మంత్రివర్గానికీ అభినందనలు.


మరింత సమాచారం తెలుసుకోండి: