ఏపీ సీఎం వైఎస్ జగన్  తన మంత్రివర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి.  అన్ని శాఖల హెచ్‌ఓడీలు, సెక్రటరీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీప్ విప్‌గా గడికోట శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్  జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్‌ స్కీమ్ ను రెన్యూవల్ చేస్తూ సీఎం జగన్ మూడో ఫైల్ పై సంతకం చేశారు.  గత నెల 30 న ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ కి నేడు సచివాలంలో అడుగు పెట్టారు. ఆయనకు స్వాగతం పలికిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. 

ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ..రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉంది.. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయడానికి అధికారులంత సిద్ధంగా ఉన్నారు. అనేక సవాళ్ళను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడ అధికార యంత్రాంగానికి ఉంది, లక్ష్యాలకు అనుగుణంగా, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికరులున్నారని అన్నారు.


ఇక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ..ఇక్కడ వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు.... ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారు... మీరు పూర్తిగా సహకరిస్తే ప్రజల- ప్రభుత్వ కల సాకారం అవుతుంది.  ఇప్పటి వరకు ఏపిలో జరిగిన అవినీతి చాలు..అవినీతి అంతం..జగన్ పంతం అనే విధంగా పాలన కొనసాగాలని ఆయన అధికారులకు సూచించారు. 


మీపై నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది... ఈ ప్రభుత్వంలో అవినీతి కి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడానికి ధృఢ సంకల్పం తో ఉన్నాను. అవినీతిని నిర్ములించి ప్రభుత్వానికి నిధులు ఆడ చేయండి... అధికారులకు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలి అని అధికారులతో ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: