తెలంగాణలో కొంత కాలంగా బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని చూశారు.  అయితే ఓడిన చోటే గెలవాలనే సూక్తితో మొన్నామద్య జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి మంచి విజయం సాధించారు. 

ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రి హోదా దక్కింది. అయితే కేంద్రమంత్రిగా తొలిసారి నగరానికి వచ్చిన కిషన్ రెడ్డి కి ఛేదు అనేభవమే మిగిలింది.
కిషన్ రెడ్డి నగరానికి వస్తున్న సందర్భంగా బీజేపీలో అంతఃకలహాలు మొదలయ్యాయి. కిషన్‌రెడ్డి నగరానికి వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో నాయుకుడు చించివేయడం తీవ్ర కలకలం రేపుతోంది.

బీజేపీలోని విభేదాలకు ఇది అద్దం పడుతోంది.  సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన బండపల్లి సతీష్‌కుమార్‌ చిలకలగూడ చౌరస్తా నుంచి వారాసిగూడ వరకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో తన ఫొటో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన  సికింద్రాబాద్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జి రవిప్రసాద్‌గౌడ్, అతడి కుమారుడు సాయిగౌడ్‌‌లు ఫ్లెక్సీలను చించివేశారు.

దాంతో అక్కడ చిన్న గొడవతో మొదలైన ఈ విషయం చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఈ విషయం తెలిసిన సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అంతు చూస్తానని కూడా రవిప్రసాద్ బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫొటోలేని ఫ్లెక్సీలను తన ఇల్లు, కార్యాలయం ముందు పెట్టి తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: