రాజకీయాల్లో తలలు పండిన వారికి కూడా కొన్ని సార్లు తాము ఆశించిన పదవులు దక్కవు.  ఒక పార్టీకి విధేయులుగా ఉండి ఎంత కాలం సేవ చేసినా సరైన గుర్తింపు ఉండదు..ఎలాంటి పదవులు దక్కవు.  కానీ కొంత మందికి మాత్రం అదృష్టం పడిశం పట్టినట్లుగానే ఉంటుంది..అది డబ్బు బలమో..మరే ఇతర బలమైనా కావొచ్చు. 

పార్టీలో చేరిన అతి తక్కువ కాలంలోనే కళ్లు చెదిరే పదవులు చేజిక్కించుకుంటారు కొంతమంది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌  పార్టీకి ప్రజా తీర్పు అనుకూలంగానే ఉన్నా అవసరమైన పూర్తి బలం రాకపోవడంతో చివరికి అదృష్టాన్నే నమ్ముకుంది. ఇంకేముంది..ఆ అదృష్టం ఆమెకు లాటరీ ద్వారా తలుపు తట్టింది.
 
మరికొంత మందికి వారసత్వంగా వచ్చే రాజకీయాలు ఉంటాయి..అలా అని కుటుంబంలో అందరూ రాజకీయ వారసులు కూడా కాలేరు..కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది.  అయితే కొంత మందికి అదృష్టం కలిసి వచ్చి అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం పదవులు దక్కడం కూడా జరుతుతుంది. ఇందుకు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలాధ్యక్షురాలిగా ఎంపికైన హాలావత్‌ జ్యోతి ఉదాహరణ అని చెప్పొచ్చు.నర్సాపురం మండలంలో మొత్తం పది ఎంపీపీటీసీ స్థానాలున్నాయి. 

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ చెరో ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. ఇద్దరికీ సమానమైన బలం ఉందని తేలడంతో..ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యులను లాటరీ పద్ధతిలో ఎన్నుకోవాలని అధికారులు నిర్ణయించారు. నర్సాపూర్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో లాటరీ తీశారు. ఈ లాటరీ లో అదృష్టం కాంగ్రెస్‌ ఎంపిటీసీ సభ్యురాలు హలావత్‌ జ్యోతి తలుపుతట్టింది. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పట్టునిలుపుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: