ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ మంత్రి వర్గ కూర్పును చేశారు. కానీ పచ్చ మీడియా ఎదో చేయాలనీ ప్రయత్నిస్తుంది. కేబినెట్ పదవులు రానివాళ్ల గురించి ప్రత్యేకంగా రాస్తూ.... ఇంత గొప్ప నాయకులకు కూడా మంత్రిపదవి రాలేదనే ప్రచారం చేయడం ద్వారా... పార్టీలో ముసలం పెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఫలానా వాళ్లకు మంత్రిపదవి రాలేదు... ఎన్నో ఆశలు పెట్టుకున్న అనుచరులంతా పాపం ఆవేదన చెందుతున్నారు... అనేతరహా కథనాలను వండి వారుస్తున్నారు.


జగన్మోహన రెడ్డి తన కేబినెట్ విషయంలో విలక్షణతను స్పష్టంగా చూపించదలచుకున్నారు. ఆయన మంత్రి పదవులు ఇవ్వలేదు అనే నిందలే వేయదలచుకుంటే గనుక... ఆ రకంగా చెప్పాలంటే... ఎన్నికలకు ముందు ప్రజల ఎదుట మంత్రిపదవి ఖచ్చితంగా ఇస్తానని మాట ఇచ్చిన వారికి కూడా ఈ కేబినెట్ లో చోటు దక్కలేదు. సాధారణంగా జగన్ మాట ఇచ్చిన తర్వాత తప్పరనే పేరుంది. కానీ, ఎన్నికలకు ముందు మాట ఇచ్చిన వారిలో బాలినేనికి మాత్రమే కేబినెట్ ఛాన్స్ దక్కింది.


ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్ లాంటి వారికి చోటు దక్కలేదు. మధ్యలో రోజాకు దక్కలేదని పచ్చమీడియా ఆవేదన చెందుతున్నది. అంతకు మించి కొమ్ములు తిరిగిన చాలామందికి కూడా కేబినెట్ బెర్తులు దక్కలేదు. జగన్ చాలా స్పష్టంగా.. ఈ కేబినెట్ రెండున్నరేళ్లు ఉంటుందని... ఆ తర్వాత కొందరిని తప్పించి కొత్తవారికి చాన్స్ ఇస్తానని అన్నారు. ఈలోగానే... వారిలో లేని అసంతృప్తిని పుట్టించి కుంపట్లు రాజేయడానికి పచ్చమీడియా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: