పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు.  ఈ ఓటమికి పవన్ చాలా కారణాలు చెప్పాడు.  ఎన్నికల్లో తెలుగుదేశం, వైకాపాలు డబ్బును నీళ్లలా వెదజల్లాయని, డబ్బు పెట్టి గెలిచిన ఆ గెలుపు గెలుపే కాదని అన్నాడు.  ఇప్పుడు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  


పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని అందరు వాపోతున్నారు.  పవన్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.  మాములుగా రాజకీయనాయకులు గెలిస్తే ఒకలా.. ఓడిపోతే మరోలా మాట్లాడటం సహజం.  సమాజం పై అవగాహనా కలిగి ప్రజల్లో మార్పును తీసుకొస్తానని చెప్పిన పవన్ ఇలా మాటాడటం విడ్డూరంగా మారింది.  


ఎవరైనా సరే ఎన్నికల్లో పదివేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలవడానికి అన్ని ఓట్లను కొనడం అంటే మామూలు విషయం కాదు.  ఏ పార్టీకి అది సాధ్యం కాదు.  ప్రజలు ఎలా తీర్పు ఇవ్వాలని అనుకుంటారో వాళ్ళకే ప్రజలు ఓట్లు వేస్తారు. అంతేగాని డబ్బు ఇచ్చినంత మాత్రానా ఓటు వేయాలని లేని.. డబ్బు తీసుకున్నంత మాత్రానే ఒకరికే వేయాలని ఉండదు.  


అందరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు.  ఎవరికి ఓటు వేయాలలో వాళ్ళకే వేస్తారు.  తమ పార్టీ డబ్బును ఖర్చు పెట్టి ఓటు అడగం అని చెప్పినట్టు పవన్ చెప్పారు.  కానీ, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఎన్నికల సమయంలో ఆ పార్టీ నేతల దగ్గరి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బును పట్టుకున్నారు.  దీనిపై కామెంట్ ఏంటో పవన్ చెప్పాలి.  మార్పు తెస్తానని చెప్పిన పవన్.. మాములు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతుండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: