వైకాపా ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో ముందుగా పండుగ చేసుకుంది రోజానే.  పార్టీ కోసం రోజా చాలా చేసింది.  పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంది.  తన వాయిస్ ను బలంగా వినిపించింది.  దీంతో సభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ అయ్యింది.  ఇది గతం. 

ఇప్పుడు టిడిపి ఘోరంగా ఓడిపోయింది.  వైకాపా అధికారంలోకి వచ్చింది. రోజాకు తప్పకుండా మంత్రి పదవి వస్తుంది.. ఆమెకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని అంతా అనుకున్నారు.  చివరకు ఎం జరిగింది.  అందరికి ప్రాధాన్యత ఇచ్చి రోజాను పక్కన పెట్టారు.  


ఎంత చెప్పుకోలేకపోతున్నా .. మనసులో  వెలితి తప్పకుండా ఉంటుంది.  ఎన్నికలకు ముందు వివిధ పార్టీల్లో నుంచి వచ్చిన కొంతమందికి  మంత్రి పదవులు ఇచ్చారు.  2014 లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగాఓడిపోయాక .. ఆ పార్టీ నుంచి కొంతమంది సీనియర్ నేతలు వైకాపాలో జాయిన్ అయ్యారు.  ఇప్పుడు వీళ్లకు కూడా పదవులు వచ్చాయి.  


కానీ, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీతో కలిసి ఉన్న రోజాకు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు.  ఎందుకు ఇవ్వలేకపోతున్నారనే రీజన్ పార్టీ నుంచైనా అధికారికంగా వెలువడితే బాగుంటుంది.  వైకాపా తరపున వాయిస్ ను ఎప్పటికైనా బలంగా వినిపించేది రోజానే కాబట్టి ఆమె విషయంలో జగన్ ఎందుకు ఇలా చేశాడో ఖచ్చితంగా చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: