జగన్ మొదటి సంతకం ఓ సంచలనం. జగన్ సీఎం గా సచివాలయంలో ఫైల్ మీద తొలి సంతకం మరో సంచలనం. ఇపుడు జగన్ పాతిక మంది మంత్రులతో రేపటి రోజున తొలి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలన్నది జగన్ ఆలోచన‌గా ఉందంటున్నారు.


ఈ సమావేశంలో రైతు భరోసా పధకానికి  ఆమోద ముద్ర వేయడం ద్వారా ఏపీలోని మొత్తం రైతుల మనసును చూరగొనే నిర్ణయాన్ని జగన్ తీసుకుంటారని అంటున్నారు. ఏడాదికి 12,500 వేల రూపాయ‌లతో రైతులకు పెట్టుబడి సాయంగా ఈ మొత్తాన్ని ఈ రబీ నుంచే జగన్ సర్కార్ అందిస్తుందని అంటున్నారు.


అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తూ మరో అతి కీలకమైన నిర్ణయానికి జగన్ క్యాబినెట్ ఆమోదముద్ర వేస్తుందని అంటున్నారు. దీనివల్ల లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇక ఆశా వర్కర్లకు పెంచిన పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని ఆమోదిస్తూ, అలాగే వ్రుద్ధులకు 2,250 రూపాయలు పించను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ తొలి క్యాబినెట్ అమోదముద్ర వేస్తుంది.


ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే ఆర్టీసీ కార్మికులు సమ్మె బాటలో ఉన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తూ  ఆర్టీసీని విలీనం చేసే ప్రతిపాదనకు కూడా ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.   మొత్తానికి చరిత్రలో నిలిచిపోయేవిధంగా క్యాబినెట్ నిర్ణయాలు  ఉంటాయని, జగన్ సాహసోపేతమైన అనేక అంశాలకు తొలి క్యాబినెట్ ఆమోదముద్ర వేస్తుందని అంటున్నారు. సోమవారం తొలిసారి జగన్ మంత్రివర్గం సమావేశం జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: