జగన్ తన మంత్రి వర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఎవరికి అంతుపట్టని విధంగా మంత్రి వర్గాన్ని ప్రకటించారు.  మొదట రోజాకు పోస్టింగ్ ఉంటుంది అనుకున్నా ... ఆమెను  పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.  నగరి నుంచి రెండు సార్లు గెలిచినా ఆమె కు పదవి దక్కలేదు.  


అయితే, రోజాకు వస్తుంది అనుకున్న మంత్రి పదవి సుచరితకు దక్కింది.  సుచిరతకు ఈ పదవి ఇవ్వడం వెనుక కారణం ఉంది.   వైఎస్ హయాంలో హోమ్ మంత్రి పదవిని మహిళకు కట్టబెట్టారు.  అదే విధంగా వైఎస్ జగన్ కూడా తన మంత్రివర్గంలో హోమ్ శాఖ మంత్రి పదవిని సుచరితకు ఇచ్చారు.  


ఇదొక రీజన్ కావొచ్చు.  ఇక్కడ మరొక రీజన్ కూడా ఉంది.  అదేమంటే 2009 లో వైఎస్ మరణం తరువాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైకాపాను స్థాపించిన సమయంలో సుచరిత .. కాంగ్రెస్ ను వీడి వైకాపాలో జాయిన్ అయ్యింది.  


అప్పటికే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు.  తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. మరలా ఉపఎన్నికలు జరిగాయి.  2012లో జరిగిన ఉపఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యే గా గెలిచారు.  అనంతరం 2014లో ఆమె రావుల కిషోర్ పై ఓటమి పాలయ్యారు.  రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో మరోమారు సుచరిత ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  సుచరిత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి జగన్ కు తోడుగా ఉండటంతో జగన్ ఆమెకు కృతజ్ఞతగా మంత్రిపదవికి ఇచ్చారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: