తెలంగాణలో ఫైర్ బ్రాండ్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనే చెప్తారు.  కెసిఆర్ కు రేవంత్ రెడ్డి అప్పట్లో చుక్కలు చూపించాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తరువాత కూడా కొన్ని రోజులు రేవంత్ రెడ్డి తన బాట మార్చుకోలేదు.  అధికారంలో ఉన్న తెరాస ను నిద్రపోనివ్వకుండా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు.  


పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నియోజక వర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. ఎంపీగా విజయం సాధించిన తరువాత రేవంత్ రెడ్డి తన నియోజక వర్గంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. పార్టీతో ఉంటున్నాడు కానీ.. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువ తలదూర్చడం లేదు.  


రైల్వే వ్యవహారాలకు సంబంధించిన పనులు చక్కదిద్దుకుంటూ బిజీ అయ్యాడు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ కు, తెరాస కు మధ్య వార్ నడుస్తున్నది.  కాంగ్రెస్ కు ప్రతి పక్ష హోదా దక్కకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలకు ఎరవేసి సంగతి తెలిసిందే. 


తెరాస ట్రాప్ లో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరిపోయారు.  ఇప్పుడు కాంగ్రెస్ కు సంఖ్యాబలం లేదు.  దీంతో కాంగ్రెస్ శాసన సభా ప్రతిపక్ష హోదాను విలీనం చేసుకుంది తెరాస.  దీనిపై న్యాయపరమైన పోరాటం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పోరాటం చేస్తుంది.  ఈ పోరాటానికి రేవంత్, కోమటిరెడ్డిలు హాజరు కాకపోవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: