ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి జూన్ నెలలో ఏ ఒక్కరి అకౌంట్లోను జమ కాలేదు. ప్రతి నెలా ఒకటీ రెండో తేదీలలో జమ అయ్యే భృతి ఈ నెలలో జమ అవుతుందా లేదా అనే ప్రశ్న నిరుద్యోగుల్లో మెదులుతోంది. దీనిపై ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఈ పథకం భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్నాయి. 

 

ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను భారీ గా నియామకం చేసుకోబోతుంది కాబట్టి ఈ పథకం కొనసాగకపోవొచ్చనే అనుమానాలు వున్నాయి. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కావడంతో ఈ పథకం గురించి మరి కొన్ని రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకం గురించి చర్చకు వచ్చే అవకాశం ఉంది

 

నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగ భృతి పథకాన్ని కొనసాగిస్తే బాగుంటుందని ఈ పథకం వల్ల ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పరీక్షలకు నిరుద్యోగ భృతి చాలా ఉపయోగపడుతుందని , పట్టణాల్లో హాస్టల్లో ఉండే అభ్యర్థులు వారి యొక్క హాస్టల్ ఫీజూలకు ఈ పథకం ఉపయోగపడిందని పలువురు నిరుద్యోగులు అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: