రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ కడప, కర్నూల్ జిల్లాల్లో మెజారిటీ స్థానాలు సాధించినా అనంతపూర్ చిత్తూర్ జిల్లాల్లో స్థానాలతో టీడీపీ తన పరువు నిలబెట్టుకుంది. అనంతపూర్ జిల్లా దశాబ్దాలుగా టీడీపీ కి కంచుకోటగా ఉంది.

 

కానీ అదంతా గతం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని అందుకుంది . ఇక్కడ టీడీపీ గెలుచుకుంది మూడంటే మూడు సీట్లు. కడప, కర్నూల్ జిల్లాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది.ఈ మూడు సీట్లలో ఒకటి చంద్రబాబు నాయుడు గెలవగా మరొకటి నందమూరి బాలకృష్ణ ఇంకో సీటు లో పయ్యావుల కేశవ్ గెలుపొందారు

 

గత ఐదేళ్ళలో చంద్రబాబు తన పరిపాలనలో రాయలసీమకు ప్రాముఖ్యత ఇవ్వకపోవటంతొ ప్రజలు ఈ విధమైన తీర్పు చెప్పారు. ప్రతిపక్ష నాయడిగానైనా చంద్రబాబు రాయలసీమను పట్టించుకోకపోతే రాయలసీమలొ తెలుగు దేశం పార్టీ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తను పుట్టిన జిల్లా మరియు రాయలసీమ గురించి ఆలోచిస్తారో లేదో చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: