వైఎస్ జగన్ ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారిపోయారు.  2011 వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వైకాపాను స్థాపించాడు.  అప్పటి నుంచి ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పోరాటం చేశాడు.  2011 నుంచి తెలంగాణాలో జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర సక్సెస్ కావడంతో ఆంధ్రప్రదేశ్ కూడా మొదలుపెట్టే సమయంలో ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయింది.  


అయినప్పటికీ జగన్ డీలా పడలేదు.  2014 ఎన్నికల్లో దాదాపు గెలిచినంత పనిచేసినా.. కేవలం ఐదు శాతం ఓటింగ్ తో జగన్ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ప్రజా సమస్యలపై పోరాటం చేశాడు.  లక్షకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు అని నిందలు వేశారు.  కోర్టు కేసులు వేశారు.  


అయినా జగన్ బెదరలేదు.  మొక్కవోని ధైర్యంతో జగన్ ముందుకు అడుగులు వేశారు.  పార్టీలోనుంచి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్తున్నా కుంగిపోలేదు.  భవిష్యత్తుపైన నమ్మకం.. ప్రజలు తమపై తప్పకుండా విశ్వాసం చూపిస్తారన్న నమ్మకం జగన్ ను ముందుకు అడుగులు వేసేలా చేసింది. 


డబ్బు పలుకుబడి ఉండొచ్చు.  అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసం ఉండాలి. పవన్ జగన్ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.  సభలు సమావేశాల్లో భారీ భారీగా డైలాగులు చెప్తే యూత్  చప్పట్లు కొడుతోంది గాని, ఓటర్లు కాదు.  జగన్ ఓటర్లను ఆకర్షించేందుకు మాట్లాడిన తీరు గురుంచి తెలుసుకోవాలి.  వాళ్లకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇచ్చేలా మాట్లాడాలి.  అప్పుడే ప్రజలు నమ్ముతారు.  సో,  ప్రజల హృదయాల్లో జనసేనాని ఇప్పుడు ఆ నమ్మకం కలిగించాలి.  అప్పుడే వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపగలుగుతారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: