ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు రోజా. రోజాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు.  రోజాను ఎందుకు పక్కన పెట్టారు.  రోజాకు.. జగన్ కు మధ్య గొడవలు వచ్చాయా.. మంత్రి వర్గ విస్తరణ సమయంలో రోజాఎందుకు రాలేదు.  విజయవాడలో అందుబాటులో ఉండాలని చెప్పిన జగన్... మాటకు రోజా ఎందుకు కట్టుబడి ఉండలేదు.. 


ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.  వీటికి సమాధానాలు ఎలా ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు.  రోజాను ఎందుకు పక్కన పెట్టారు అనే దానికి ఓ చిన్న క్లారిటీ వచ్చినా అందులో ఎంతవరకు నిజం ఉండొచ్చు తెలియడం లేదు.  


చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి  పదవులు ఇవ్వాలని అనుకున్నారు.  సీనియర్ కాబట్టి పెద్దిరెడ్డికి అవకాశం వచ్చింది.  అంతేకాదు, ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి వైకాపాకు సహాయ సహకారాలు అందించారని టాక్.  అందుకే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. 


రెండో పదవి రోజాకు ఇవ్వాలని అనుకున్నారు.  మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం కనబరచాలని చెప్పి రోజాకు కాకుండా పదవిని రిజర్వ్ వర్గానికి కేటాయించారట.  రోజాను విజయవాడలో అందుబాటులో ఉండాలని చెప్పిన జగన్.. ఫైనల్ లిస్ట్ లో పేరు లేకపోవడంతో మనస్తాపం చెందిన రోజా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిందని టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: