వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యాక మొదటిసారి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాని మోడీని కలుసుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు మోడీని రేణిగుంట విమానాశ్రయంలో కలిసి.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లారు.  తిరుమల వెళ్లే సమయంలో మోడీతో చర్చలు జరుపుతారు.  


మోడీతో రాష్ట్రానికి సంబంధించిన ఆర్ధిక విషయాల గురించి చర్చిస్తారు.  అలానే,  మోడీతో రాష్ట్రనికి సంబంధిన నిధుల విషయంపై చర్చిస్తారు.  రాష్ట్రానికి రావల్సిన 75వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కోరనున్నారు.  దీనికి మోడీ ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.  


మోడీ రాష్ట్రానికి వచ్చిన తరువాత రేణిగుంట సమీపంలో భారీ బహిరంగ సభ జరగబోతున్నది.  దాదాపు 5వేల మంది కూర్చోవడానికి అనుగుణంగా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ సభలో వచ్చే ఐదేళ్ళలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు అనే దాని గురించి మాట్లాడతారు.  


ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి సహకరించే విషయాలపై కూడా చర్చిస్తారు.  అలాగే, దేశంలో ఉగ్రవాదం పైన, ఆర్ధిక వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై కూడా ఈరోజు జరిగే సభలో మాట్లాడతారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: