ఏపీ యువ ముఖ్యమంత్రి జగన్ గత కొద్దిరోజులుగా రోజుకో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి పక్ష పార్టీలకు,ప్రజలకు షాక్ లు ఇస్తున్నారు.అలాంటి జగన్ కు ఈసారి కేంద్రం షాక్ ఇచ్చింది.ఆయన చేసిన ఒక వినతిని తిరస్కరించింది.దీనితో జగన్ దూకుడుకు తొలిసారి బ్రేక్ పడింది.

గత ప్రభుత్వం పై అవినీతి ఆరోణలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్ కు ఇప్పుడు ఆ అవినీతిని నిరూపించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వరుసగా షాక్ లు తగులుతున్నాయి.అవసరానికి మించి డబ్బును టెండర్ల రూపం లో తినేసిన కాంట్రాక్టర్ల లెక్కలు చూపెట్టిన అధికారులకు  ప్రభుత్వం బహుమానం ఇస్తుందని ప్రకటించారు.కాని ఇప్పటికీ రెండు సార్లు సమీక్షలైనా  వైసీపీ ప్రచారం చేసిన లెక్కలు అన్ని నిజమని నిరూపించే దిశగా అడుగులు పడలేదు.

గత ప్రభుత్వం పవన,సౌర విద్యుత్ కొనగోలు కోసం చేసుకున్న ఒప్పందాల ను సమీక్షించాల్సిందిగా గా జగన్ కేంద్రాన్ని కోరాడు.కాని కేంద్రం జగన్ వ్యాఖ్యలు పెట్టుబడి దారులను బయపెట్టెలా ఉన్నాయని ఏపీ సిఎస్ కు లేక రాసింది.ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఇది అంతా నిబంధనలను లోబడి ఒప్పందలు చేసుకున్నట్టు పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: