తెలుగుదేశం పార్టీ ఇపుడు ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ఎన్నడూ లేని విధంగా దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. ఈ నేపధ్యంలో బంపర్ మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్ ఏం చేయబోతున్నారన్నది పెద్ద చర్చగా మారింది. జగన్ దూకుడు చూస్తూంటే ఏపీలో సంచలన పరిణామాలు రానున్న రోజుల్లో చోటు చేసుకోబోతున్నాయని అర్ధమవుతోంది.


ఏపీలో పోలవరం లాంటి మేజర్ సాగునీటి ప్రాజెక్టులే కాకుండా అనేక మీడియం, మైనర్ ప్రాజెక్టులు ప్రతుతం నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అన్నింటిలోనూ అవైనీతి చోటు చేసుకుందని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడే వరస ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇపుడు అధికారంలోకి రావడంతో జగన్ తక్షణ ప్రాధాన్యత కింద ప్రాజెక్టుల అవినీతిపైనే ద్రుష్టి పెట్టారు.


దాదాపుగా 55 వేల కోట్ల పై చిలుకు అవినీతి ఈ ప్రాజెక్టులు అన్నింటిలో జరిగిందని జగన్ సర్కార్ భావిస్తోంది. దీనికి సంబంధించి నిజానిజాలు వెలికి తీసేందుకు నలుగురు సభ్యులతో థర్డ్ పార్టీ కమిటీని వేయబోతోంది. ఈ కమిటీ మూడు నెలల పాటు అధ్యయనం చేసి కీలకమైన నివేదికను ముఖ్యమంత్రికి అందచేస్తుంది. దానిని బట్టి అక్రమార్కులను, వారి వెనక ఉన్న పెద్దలను కూడా బయటపెట్టి కఠినంగా శిక్షించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతుందని అంటున్నారు.


వేల కోట్ల రూపాయల ప్రజాధనం ప్రాజెక్టుల రూపంలో లూటీ అయిందని జగన్ ఇప్పటికే పలు వేదికల మీద విమర్శలు చేశారు. అందువల్ల జగన్ ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరన్నది నిజం. నీటి పారుదల రంగ ప్రముఖులు, నిపుణులతో జగన్ సర్కార్ వేసే కమిటీ నివేదిక టీడీపీకి  ఓ బాంబు లాంటిదేనని చెప్పాలి. అది కాని నెత్తిన పడితే సైకిల్ ఏమవుతుందోనని తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: