రోజా వైకాపాలో ఫైర్ బ్రాండ్.. ఇదే ఆమెకు చేటు చేసింది.  ప్రతిపక్షంలో ఉండగా మంచి చేసిన ఈ ఫైర్ బ్రాండ్ ట్యాగ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చేటు చేసింది.  ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ ఉన్న వ్యక్తులను పక్కన పెట్టారు.  సౌమ్యులు, అనుకూలురు అనుకున్న వ్యక్తులకు పట్టంగట్టారు.  


ఎందుకు ఇలా చేసారు అనే దాన్ని పక్కన పెడితే.. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయంపై చర్చిస్తే మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది.  ఫైర్ బ్రాండ్ లకు పట్టంగట్టడం వలన ప్రతిపక్షాల విమర్శలకు తావు ఇచ్చినట్టు అవుతుంది.  


కాబట్టి ఇది తెలుసుకున్న జగన్ రోజాను పక్కన పెట్టారు.  రోజాను పక్కన పెట్టడం వలన పార్టీకి మంచి జరుగుతుంది.  అయితే, పక్కన పెట్టడం అంటే పూర్తిగా పక్కన పెట్టకుండా ఆమెకు నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారట.  అంతేకాదు, ఆమెకు ఆర్టిసి చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది.  


ఇది క్యాబినెట్ ర్యాంక్ పోస్టింగే.  కాకపోతే మినిస్టర్ స్థాయి పోస్ట్ కాదు.  వచ్చే రెండున్నర సంవత్సరాలలో రోజాకు పదవి అప్పగించినా ఆశ్చర్యపోనవసరం లేదు.  మరి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: