ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోవ సారి జరిగిన శాసన సభ ఎన్నికల్లో 151 సీట్లతో యువజన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ తో పాటు మరో 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జగన్ వైకాపా పార్టీ పెట్టినప్పుడు సీని నటి రోజా పార్టీలో చేరింది. వైకాపా తరపున చిత్తూరు జిల్లా నగరి ప్రాతంలో రెండు సార్లు ఎమ్మేల్యేగా గెలిచింది.

వైకాపా మంత్రుల లిస్ట్ లో రోజాకు చోటు దొరక్కపోవడంతో ఆమె అసంతృప్తి తో ఉన్న సంగతి తెలిసిందే.  పైకి జగన్ చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటామని అన్నా.. లోపల మాత్రం అసంతృప్తి ఉంటుంది అన్నది తెలిసిన అంశమే.  రోజాకు పదవి ఇవ్వకపోవడం వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయో తెలియదు. రెండున్నర సంవత్సరాల తరువాత మళ్ళీ మంత్రి పదవులకు కొత్తవాళ్లను ఎంపిక చేస్తారు కాబట్టి అప్పుడు రోజాకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే తాజా సమాచారం ప్రకారం రోజాకు ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కీలక కట్టబెట్టే యోచనోల జగన్ ఉన్నారు.

ఎమ్యెల్యే ఆర్‌కె రోజాకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆర్టీసీ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా 25 మంది మంత్రుల‌తో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివ‌ర్గం కొలువు తీరిని విష‌యం తెలిసిందే. ఈ మంత్రి వ‌ర్గంలో ఎమ్మెల్యే రోజాకు చోటుద‌క్క‌లేదు. ఈమేర‌కు ఆర్టీసీ చైర్మ‌న్‌గా రోజాను నియ‌మించే యోచ‌న‌లో సీఎం జ‌గ‌న్‌ ఉన్న‌ట్లు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: