వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సార‌థ్యంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణ‌యాల్లో భాగంగా త‌న శాఖలోని కీల‌క మార్పుల‌పై  ఫిషరీస్ శాఖ ,పశుసంవర్ధక మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు వెల్ల‌డించారు. గుంటూరులో తాజాగా ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ, చేపలవేటకు వెళ్లే వారు ప్రమాదవశాత్తు మరణించినవారికి 10 లక్షల రూపాయల సాయం ప్రభుత్వం వెంటనే అందిస్తుందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు జగన్మోహనరెడ్డి ప్రవేశపెడుతున్నారని వెల్ల‌డించారు. 


గటంలో ఫిషరీస్ శాఖను అన్ని ప్రభుత్వా లు నిర్లక్ష్యం చేశాయని, అయితే, విదేశీ మారికద్రవ్యం వచ్చేది ఫిషరీస్ శాఖ ద్వారానేన‌ని మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ స్ప‌ష్టం చేశారు. ఏరోజైతే డీజిల్ కొట్టించుకొంటారో బోటు ఓనర్లకు వెంటనే డీజిల్ సబ్సిడీ వారి అక్కొంట్ లో జమ అయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్ల‌డించారు.ఈ నిర్ణ‌యం ద్వారా వారు అప్పుల పాలు అవకుండా మ‌రియు వ‌డ్డీ వ్యాపారుల చేతిలో మోస‌పోకుండా ఉంటుంద‌ని వెల్ల‌డించారు. తాను ఓడిపోయినప్పటికి త‌న‌మీద నమ్మకంతో ఇచ్చిన 3 శాఖలను ప్రజలకు ఉపయోగపడే విధంగా నడుచుకుంటాన‌ని మంత్రి మోపిదేవి వెల్ల‌డించారు. నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులందరికి అందే విధంగా కృషి చేస్తానన్నారు.


వైఎస్‌ జగన్‌ 2019లో సైతం మోపిదేవిని రేపల్లె నుంచి బరిలో నిలిపారు. అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. జిల్లాలో 15 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. వీరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే లెక్కలు వేసుకుంటున్న తరుణంలో నమ్ముకున్న వారికి తమ కుటుంబం ఎన్నడూ అన్యాయం చేయదని రుజువు చేస్తూ ఓటమి పాలైన మోపిదేవికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: