టీవీ 9 వివాదంలో రవిప్రకాశ్ చెప్పినట్లుగా వ్యవహరించిన శివాజీ... టీవీ 9 కొత్త యాజమాన్యాన్ని అడ్డుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో రవిప్రకాశ్ తో పాటు శివాజీపై కూడా తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. కొంతకాలం పాటు పోలీసులకు చుక్కలు చూపించిన రవిప్రకాశ్ ఇప్పుడు తప్పదన్నట్లుగా పోలీసుల ముందు హాజరైపోయారు. రవిప్రకాశ్ మారిదే శివాజీ కూడా పోలీసుల ఎదుటకు వస్తారని ఆశించినా... ఆ దిశగా శివాజీ నడచుకోకుండా షాకిచ్చారని చెప్పాలి.


పోలీసుల ఎదుటకు వస్తే... ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో శివాజీ ఏకంగా దేశం దాటి వెళ్లిపోయి ఉంటారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని తిరుమల వెంకన్నను దర్శించుకుని గుండు గీయించుకున్నానని వడదెబ్బ కారణంగా రెస్ట్ తీసుకుంటున్నానని త్వరలోనే పోలీసు విచారణకు హాజరవుతానని సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసిన శివాజీ... రోజులు గడుస్తున్నా గానీ జాడ లేకుండా పోయాడు.


ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి తిరిగేందుకే శివాజీ గుండు నాటకం ఆడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తనపై అన్ని ఎయిర్ పోర్టుల్లో లుకౌట్ నోటీసులు జారీ కావడంతో శ్రీలంకకు సముద్ర మార్గాన వెళ్లి అక్కడి నుంచి ఏ అమెరికాకో లేదంటే ఇంకే దేశానికో అతడు పారిపోయి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గరుడ శివాజీ .. అప్పుడు గరుడ పురాణం అని హల్ చల్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే 

మరింత సమాచారం తెలుసుకోండి: