పోటీ అన్నాక గెలుపోటములు తప్పనిసరి.  ఒకసారి గెలుస్తారు మరోసారి ఓడిపోతారు.  గెలిచినా పార్టీలు అధికారంలోకి వస్తాయి.  ఓడిన పార్టీలు రివ్యూ చేసుకుంటాయి.  ఎందుకు ఓడిపోయామో తెలుసుకొని ఆ తప్పులు చేయకుండా జాత్రత్త పడతాయి.  


గత ఎన్నికల్లో వైకాపా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.  ప్రమాణస్వీకార మహోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించారు జగన్.  చంద్రబాబు వెళ్లే పరిస్థితి లేక.. తన తరపున గంట శ్రీనివాస రావును వెళ్లమని చెప్పాడట.  గంట విష్ చేద్దామని జగన్ కు ఫోన్ చేస్తే.. ఫోన్ కు రిప్లయ్ ఇవ్వలేదని అన్నారు.  


ప్రమాణ స్వీకార సమయంలో జగన్ టిడిపి విమర్శించడం సరికాదని అన్నారు.  టెండర్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు సరిగా లేవని, దాని వలన ఇబ్బందులు పడతారని అన్నారు. జగన్ కక్ష తీర్చుకునే విధంగా ప్రవర్తించారని అన్నారు.  ప్రత్యేక హోదా విషయంలో జగన్ చేతులెత్తేశారని అన్నారు.  


వృద్ధులకు మూడు వేల రూపాయల పింఛనును అందజేస్తానని చెప్పిన జగన్ మాట మార్చి కేవలం 2000 కు ఒక 250 మాత్రమే పెంచి దశలు వారీగా 3000 కు పెంచుతానని మోసం చేసారని గంటా శ్రీనివాస్ విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: