-  తూర్పులో కలవాడిన మాజీ ఆర్ధిక మంత్రి, మాజీ హోమ్ మంత్రి  ముఖారవిందం 
తెలుగు దేశం పార్టీ ఓటమిపై మరోసారి తాజా మాజీలు అంతర్మధనం పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో మరోసారి సమావేశమై పార్టీ ఓటమికి దారితీసిన కారణాలపై సమీక్షించారు. ఈ సమావేశానికి హాజరైనవారిలో ఇద్దరు వ్యక్తులు తెలుగు దేశం పార్టీలో కీలక భాద్యతలు నిర్వహించినవారు, వారిద్దరూ తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు కావడంతో సమావేశం ఆద్యంతం నిందారోపణలతోనే సాగింది. 
తాజా మాజీల్లో ముక్యుడైన  మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కొందరి అభ్యర్థుల ప్రవర్తనపై తీవ్రస్థాయిలో నిందారోపణలు వచ్చినట్టు చర్చించడం అయ్యింది. పార్టీ అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకు వెళ్లడంలో ఘోరంగా విఫలమైనట్టు నిర్దారింఛి మదన పడ్డట్టు తెలిసింది. 
ఖచ్చితంగా గెలుస్తామనుకున్న నియోజకవర్గాల్లో ఓటమిని జీర్ణించుకోలేని తాజా మాజీ ఇప్పటికీ అంతర్మధనం పడుతున్నారు. ఎం ఎల్ ఏ పిల్లి అనంతలక్ష్మి , రామచంద్రపురం మాజీ ఎం ఎల్ ఏ తోట త్రిమూర్తులు, జగ్గంపేట, ప్రత్తిపాడు, ముమ్మిడివరం తదితర నియోజక వర్గాల్లో కచ్చితంగా గెలుపొందుతామనే ధీమాతో ఉండేవారు. కాగా వై ఎస్ ఆర్ సి పార్టీ సునామీలో తెలుగు దేశం పార్టీ కొట్టుకుపోడంతో వారి ముఖారవిందాలు కలవాడిపోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: