ఎన్నికల ముందు బీరాలు పోయిన నాయకులు ఫలితాల తర్వాత మొహాలు చాటేశారు.వారంతా ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి. రానున్న కాలం మాదే వచ్చేసారి వైసీపీ అంతు చూస్తాం మళ్ళీ పాత పాటే పాడుతున్నారు. ఆ తరహాలో మాజీ మంత్రి అఖిల ప్రియ కూడా వ్యవహరిస్తున్నారు.

తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని ఇదంతా కేవలం తనకు భయపడి వైసీపీ నేతలు టీడీపీ వారి క్యాడర్ ను గందరగోళం లో పడేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ప్రతి పక్షంలో ఉన్న అధికార పక్షం లో ఉన్న తాము ప్రజాసేవ ను ఆపబోయేది లేదని అన్నారు.

అలాగే ఇలాంటి ప్రచారం చేసి తమను ప్రజలలో చెడు చేయాలని చూస్తున్న వైసీపీ క్యాడర్ ని మరియు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కు స్థానిక ఎన్నికలలో పుంజుకొని బుద్ది చెప్తాం అని ప్రజలు ఎవరు వైపు ఉన్నారో చూపుతాం అని సవాలు విసిరారు.గతం లో ఇలాంటి సవాలు చేసిన నాయకులు అందరూ ఎన్నికలలో దారుణంగా దెబ్బతిన్నారు.వారి కోవలోకే అఖిల ప్రియ కూడా చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: