ఆమె అసలే మమత, బెంగాల్‌ లో ఎన్నికలు ముగిసాక కూడా, వైలెన్స్‌ కొనసాగుతూనే ఉంది.
ఎవరు జై శ్రీరామ్‌ అన్నా ఆ రాష్ట్ర అధికార యంత్రాంగం వెంటాడుతున్నది...
ఈ నేపథ్యంలో... 

శాంతిభద్రతలను కాపాడటంలో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కేంద్ర హోం శాఖ ఎడ్వయిజరీ జారీ చేసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఘర్షణలు జరుగుతున్నాయని, ప్రజలకు భద్రత లేకుండా పోయిందని హోం శాఖ డిసైడ్‌ అయింది. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని హోం శాఖ అంటోంది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠీని సోమవారం ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది.

గవర్నర్‌ కేసరినాథ్‌ త్రిపాఠీ రేపు ప్రధాని నరేంద్రమోడీని కలిసి రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై నివేదిక సమర్పిస్తారు. నేడు జారీ చేసిన ఎడ్వయిజరీలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నేరుగా హెచ్చరిక జారీ చేసింది. శాంతి భద్రతలను అదుపు చేయాల్సిందిగా ఆదేశించింది.
\
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగినందున రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్ర పతి పాలన విధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది, అని పరిశీలకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: