ఎందులోనైనా చంచలం ఉండొచ్చుగాని... రాజకీయాల్లో ఉండకూడదు.  అలా ఉంటె.. ఎప్పుడు ఎం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది.  జీవితం రెండింటి చెడ్డ రేవడిలా మారుతుంది.  వంగవీటి రాధ విషయంలో అదే జరిగింది.  వంగవీటి మొదట్లో వైకాపాలో ఉన్నారు.  


ఎన్నికలకు ముందు రాధ వైకాపాను వీడి టిడిపిలో జాయిన్ అయ్యారు.  ఖచ్చితంగా గెలుస్తాడని అనుకుంటే దారుణంగా ఓటమిపాలయ్యారు.  దీంతో రాధా పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మామారిపోయింది.  ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది.  


టిడిపిలో ఉండలేని పరిస్థితి.  జనసేన అనుకుంటే.. ఇప్పుడు ఆ పార్టీ అధఃపాతాళంలో ఉంది.  ఎప్పుడు పైకి వస్తుందో తెలియదు.  తిరిగి వైకాపాలోకి రావాలంటే రాలేని పరిస్థితి.  అలా వచ్చినా జగన్ జాయిన్ చేసుకోడు.  దీంతో ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. 


బీజేపీకి రాధ చాలా దూరం.  దీంతో రాధ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు.  రాధ ఏ పార్టీలో చేరకుండా.. రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని సమాచారం.  రాధా ఈ నిర్ణయం తీసుకుంటే రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించినట్టే అవుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: