తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన హైద‌రాబాద్‌ మెట్రో రైల్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఎవరు ఊహించని విధంగా మెట్రో రైలులో ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. మెట్రో రైలు ప్రారంభమైన తొలి నాళ్లలో ఓ మోస్త‌రుగా ప్రయాణించిన ప్రజలు క్రమక్రమంగా మెట్రో రైలు ప్రయాణానికి అలవాటు పడ్డారు. తాజాగా శనివారం ఒక రోజే రికార్డు స్థాయిలో మెట్రో రైలులో ప్రజలు ప్రయాణించారు. శనివారం 2.78 లక్షల మంది మెట్రో రైలులో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.  


మెట్రో రైలు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజులో ఎక్కువ మంది ప్రయాణం చేసిన వారిలో చూస్తే శనివారం నమోదైన ఫిగర్ రికార్డుగా నిలిచింది.  ఇప్పటి వరకు వారానికి  మెట్రో రైలులో 4000 మంది ప్రయాణిస్తుంటే ఇప్పుడు అదివారానికి 5000 చేరింది. మెట్రో రైలులో ప్రతి గంటకు నాలుగు వేల మంది  ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని కీలక స్టేషన్లలో ఉదయం సాయంత్రం వేళల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. మెట్రో ప్రయాణం చేసే వారిలో సగానికి పైగా స్టేష‌న్ల‌లో టికెట్లు తీసుకుంటే మ‌రి కొంద‌రు  స్మార్ట్ కార్డును వినియోగిస్తున్నారు. 


శుక్రవారం ఒక్క రోజే 1.39 లక్షల మంది టోకెన్లు కొనుగోలు చేశారు. శని ఆది వారాల్లో రెండు లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు. ఐటీ ఉద్యోగుల నుంచి సాధారణ ప్రజల వరకు ఎక్కువ మంది ఎండ తీవ్రత దృష్ట్యా మెట్రో రైలులోనే ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతున్నారు. జూన్ నెల‌ వచ్చిన ఎండ తీవ్రత తగ్గకపోవడంతో వీరంతా మెట్రో ప్రయాణం చేస్తున్నారు.  ఇక హైటెక్ సిటీ మార్గం ప్రారంభం కావడంతో కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఐటీ ఉద్యోగులు అందరూ మెట్రో ఎంచుకుంటున్నారు. దీంతో మెట్రోకు రోజు రోజుకు ప్ర‌యాణికుల తాకిడి ఎక్కువ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: