మోడీ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టారు. మోడీ ఏపీకి రావడం ఇదేమీ కొత్తకాదు. ఆయన గతంలో ఏపీ వచ్చారు. అప్పట్లో సీఎంగా చంద్రబాబు ఉన్నారు. నాలుగేళ్లు సజావుగా సాగిన మోడీ చంద్రబాబు సంసారం ఆ తర్వాత విడాకుల బాట పట్టింది.

 

అందుకు కారణం చంద్రబాబు సర్కారు   అవినీతి ప్రధాన కారణం  అంటారు కమలనాధులు.   తెలుగుదేశం  నేతలు మాత్రం మోడీ ఏపీ ని   దగా చేశాడని   విమర్శిస్తుంటారు.  ఆ కారణంతోనే  మోడీ పై యుద్ధం ప్రకటిస్తూ  తెలుగుదేశం ఎన్నికలకు వెళ్లింది.

 

ప్రత్యేక హోదాపై సమరం ప్రారంభించిన జగన్ కేంద్రంపై మాత్రం అంతగా విరుచుకుపడ్డ లేదు.  పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టినా బీజేపీతో  పెద్దగా గొడవలు పెట్టుకోలేదు.  బీజేపీ-వైసీపీ రెండు ఒకటే అని తెలుగుదేశం నేతలు విమర్శించినా పెద్దగా పట్టించుకోలేదు.

 

ఇప్పుడు జగన్ సీఎం అయ్యారు.  ఏపీ ప్రజల్లో  అశలు ఉన్నాయి.  అవి తీర్చాల్సిన బాధ్యత జగన్పై ఉంది.  అది జరగాలంటే  మోడీ సాయం అవసరం.  జగన్ ఢిల్లీ యాత్ర,  మోడీ తిరుపతి యాత్ర రెండూ సానుకూలంగానే జరిగాయి.  మరి మోడీ ఏపీకి ఎంతగా సాయం  చేస్తా డో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: