ఏపీ ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదంటూ ఎంతో ధీమాగా ఉన్న టీడీపీ అధినేతకి మే -23 వ తేదీన పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఆ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు చంద్రబాబు ఊహించి ఉండరేమో. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీడీపీ కంచు కోటలని బద్దలు కొట్టేశారు. జిల్లాలకి జిల్లాలు జగన్ కంచుకోటలుగా మారిపోయాయి. బహుశా ఇలాంటి రికార్డ్ మళ్ళీ చేధించాలంటే జగన్ కి మాత్రమే సాధ్యం అనేట్టుగా విజయాన్ని సొంతం చేసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి . ఇదిలాఉంటే అధికారం చేపట్టిన నాటి మొదలు ఈ నాటి వరకూ కూడా జగన్ మొహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, క్యాబినెట్ లో తన ఎమ్మెల్యేలకి కల్పించిన మంత్రి పదవుల వరకూ కూడా జగన్ ఏమి చేసినా సంచలనం అవుతూ వస్తోంది. విశ్లేషకుల అంచనాలకి సైతం అందనంతగా జగన్ వ్యూహాలు రచిస్తున్న తీరు ఏపీ ప్రజలకి  సరికొత్త సీఎం ని పరిచయం చేస్తున్నాయి. అయితే

Related image 

జగన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం, వేస్తున్న అడుగు చంద్రబాబు 40 ఏళ్ళ అనుభవానికి సవాల్ గా మారుతున్నాయి. సుధీర్గమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు  తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన సామాజిక వర్గాలకి పెద్దపీట వేస్తూ, మిగిలిన సామాజిక వర్గాలు సంతృప్తి పడేలా కొన్ని కొన్ని అవకాశాలు ఇస్తూ ఉండేవారు. కానీ రాజకీయంగా వారికి ఉన్నతమైన స్థానం  ఇచ్చింది మాత్రం సూన్యం అనే చెప్పాలి. కానీ జగన్ మోహన్ రెడ్డి ఇందుకు భిన్నంగా వ్యవహరించారు.

 Image result for chandrababu naidu

40 ఏళ్ళ బాబు అనుభవం మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ముందు బొక్క బోర్లా పడిందనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు హయంలో టీడీపీ ప్రభుత్వం అంటే కమ్మ సామాజిక వర్గం అనే కుల ముద్ర పడుతూ వచ్చింది, చంద్రబాబు కూడా ఈ కులముద్రని భుజాన వేసుకుని మోశారు తప్ప  ఆ ముద్రని తోలిగించుకునే ప్రయత్నం మాత్రం చేయలేక పోయారు. జగన్ మాత్రం తన క్యాబినెట్ లో అన్ని సామాజిక వర్గాల సమీకరణాలని బ్యాలెన్స్ చేస్తూ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో తన టీమ్ ని సిద్దం చేసుకున్నారు.

 Image result for chandrababu vs jagan

వైసీపీ అంటే రెడ్ల పార్టీ అనే భావం రాకుండా, కులముద్ర నుంచీ తప్పుకోవడంలో జగన్ అత్యంత చాకచక్యంగా వ్యవహించారనే చెప్పాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి సముచిత స్థానాలు ఇస్తూ, తన టీమ్ లో ఎక్కువ మంది యూత్ కి అవకాశాలు ఇచ్చారు. ఏ ప్రాంత ప్రజలు మాకు ప్రయారిటీ ఇవ్వలేదు అనే భావన రాకుండా అన్ని ప్రాంతాలకి సముచిత స్థానం కల్పించారు. ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎం లని నియమిస్తూ దేశంలోనే రికార్డ్ క్రియేట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఇవన్నీ జగన్ కి భవిష్యత్తులో అత్యంత బలమైన, ఎంతో కీలకమైన ఓటు బ్యాంక్ ని తెచ్చి పెడుతాయనడంలో సందేహం లేదనే చెప్పాలి. అంతేకాదు జగన్ వేసిన ఈ ఎత్తులని చిత్తు చేయాలన్నా, మళ్ళీ ఎన్నికల్లో జగన్ కి ధీటుగా నిలబడాలన్నా జగన్ ఇచ్చిన ఈ సవాళ్ళని బాబు అధిగమించాల్సిందే. అయితే జగన్ అనుసరిస్తున్న వ్యుహాలని చేధించడం మాత్రం సాధ్యం కాదని, ఈ ఎత్తులకి పై ఎత్తులు వేయాలంటే బాబుకి ఈ పరిణామాలన్నీ  అతిపెద్ద సవాలే అంటున్నారు విశ్లేషకులు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: